Reading Time: < 1 minute
Agra Woman Suicide Betrayed By Constable Live In Relationship

Live-In Relation: ఉత్తర్ ప్రదేశ్‌లో ‘‘లివ్ ఇన్ రిలేషన్’’ ఒక మహిళ ప్రాణాలు తీసింది. పోలీస్ కానిస్టేబుల్ చేతిలో మోసపోయారని ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. తనకు అన్యాయం జరిగిందనే ఆవేదనతో ఆమె ఆత్మహత్యకు ముందు వీడియో రికార్డ్ చేసింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధిత మహిళకు గతంలోనే వివాహం జరిగింది. అయితే, ఆగ్రాలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న సమయంలో తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ జేవీ గౌతమ్‌తో పరిచమైంది. ఆ తర్వాత 4 ఏళ్ల పాటు సహజీవనం చేసినట్లు మహిళ ఆరోపించింది.

Read Also: Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సరికొత్త రికార్డు

నాలుగేళ్ల పాటు తనను శారీరకంగా, మానసికంగా వాడుకుని ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని మహిళ ఆరోపించింది. సహజీవనం సమయంలో పెళ్లి చేసుకుంటానని తనకు హామీ ఇచ్చాడని చెప్పింది. తనను భార్యలా ఉంచుకున్నాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆరోపించింది. తన కుటుంబం పెళ్లికి ఒప్పుకోవడం లేదని గౌతమ్ తనకు చెప్పాడని, అతడు, అతడి కుటుంబం తనను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘ ఒకవైపు గౌతమ్ అన్నయ్య తనను పెళ్లి చేసుకోవాలని చెబుతుంటే, గౌతమ్ మాత్రం తన కుటుంబం ఒప్పుకోవడం లేదని చెబుతున్నాడని, తనను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు కానీ మరో అమాయకురాలిని మోసం చేయవద్దు’’ అని మహిళ కోరింది.

తాను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు, ఏమీ చేయలేమని, అతను శిక్షల నుంచి తప్పించుకుంటాడని చెప్పినట్లు ఆమె ఆరోపించింది. ఈ వీడియోలో సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్రమోడీ తనకు న్యాయం చేయాలని, బతికున్నప్పుడు ఎలాంటి న్యాయం జరగలేదని, చనిపోయిన తర్వాత న్యాయం జరగాలని కోరింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు కానిస్టేబుల్ గౌతమ్‌ను సస్పెండ్ చేశారు.