July 10, 2026

Tollywood : డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న స్టార్ డైరెక్టర్ శిష్యులు..

Tollywood : డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న స్టార్ డైరెక్టర్ శిష్యులు..
Reading Time: < 1 minute
Tollywood Directors From Sukumars Batch Upcoming Projects And Blockbuster Hopes

తను ఎదగడమే కాదు.. తన శిష్యుల్ని దర్శకులుగా మార్చి వాళ్లకు ఓ బ్యాన్ బోన్‌లా మారారు సుకుమార్. కథ, కంటెంట్ బాగుంటే సొంతంగా సినిమాలు తీసేందుకు ప్రోత్సహాన్ని అందించడమే కాదు.. తాను నిర్మాతగా మారి సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే సుకుమార్ దగ్గర దర్శకత్వంలో మెళకువలు నేర్చుకుని తమకంటూ ఓన్ పాథ్ ఏర్పాటు చేసుకుంటున్నారు యంగ్ డైరెక్టర్స్. వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో సుక్కు దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా వర్క్ చేసిన బుచ్చిబాబు ఉప్పెనతో దర్శకుడిగా మారి ఫ్రూవ్ చేసుకున్నాడు. నెక్ట్స్ రామ్ చరణ్‌తో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్దిని తెరకెక్కిస్తున్నాడు. బుచ్చి మేకింగ్ అండ్ టేకింగ్‌లో అక్కడక్కడా సుకుమార్‌ను గుర్తు చేస్తుంటాడు. ఏప్రిల్ 30న సెకండ్ టెస్ట్‌కు రెడీ అవుతోన్నాడు ఈ యంగ్ డైరెక్టర్.

Also Read : Ramayana vs Varanasi : మహేశ్ vs రణబీర్.. రాముడిగా ఎవరు పర్ఫెక్ట్…?

సుకు మరో శిష్యుడు కార్తీక్ వర్మ దండు ఫస్ట్ ఫిల్మ్ భం భం బోలేనాథ్ బెడిసి కొట్టినా.. సెకండ్ ఫిల్మ్‌ విరూపాక్షతో క్లిక్ అయ్యాడు. బ్లాక్ మ్యాజిక్ లాంటి సరికొత్త కాన్సెప్ట్‌తో వావ్ అనిపించాడు. నెక్ట్స్ మరింత బిగ్గర్ ఫిల్మ్ చేస్తున్నాడు. నాగ చైతన్యతో మిథాలజీ స్పెక్ట్రమ్ కాన్సెప్ట్‌తో వృషకర్మ చేస్తున్నాడు. తాజాగా వదిలిన గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించడమే కాదు.. మూవీపై అంచనాలు పెంచేశాయి.  రంగస్థలం, నాన్నకు ప్రేమతో సుకుమార్ దగ్గర వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెల దసరాతో మాస్ దర్శకుడిగా మారాడు. నాని కెరీర్‌లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీని అందించిన శ్రీకాంత్‌కు మరో ఛాన్స్ ఇచ్చాడు న్యాచురల్ స్టార్. ప్యారడైజ్‌లో నానిని మరింత రా అండ్ రస్టిక్‌గా చూపించబోతున్నాడు దర్శకుడు. ఆగస్టులో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీళ్లే కాదు.. కుమారి 21 ఎఫ్, 18 పేజెస్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్, తాజాగా రిలీజైన శ్రీ విష్ణు థ్రిల్లర్ ఫిల్మ్ మృత్యుంజయ్ డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ కూడా సుకుమార్ శిష్యులు. సుకుమార్ దగ్గర పాఠాలు నేర్చుకుని.. దర్శకులుగా ఫ్రూవ్ చేసుకుంటుంటే.. వారికి అవసరమైన హెల్ప్ చేస్తూ సపోర్టివ్ సిస్టమ్‌గా మారాడు ఈ లెక్కల మాస్టార్. ఈ ఏడాది సుకుమార్ రాకపోయినా.. ఆయన శిష్యులు బాక్సాఫీస్‌ను షేక్ చేసేలానే ఉన్నారు.