July 9, 2026

T20 World Cup Final: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ ఫైట్.. ప్రధాని మోడీ హాజరవుతారా?

T20 World Cup Final: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ ఫైట్.. ప్రధాని మోడీ హాజరవుతారా?
Reading Time: 2 minutes

T20 World Cup Final: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ ఫైట్.. ప్రధాని మోడీ హాజరవుతారా?

Caption of Image.

T20 World Cup Final: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు పోటీ పడుతున్నాయి.  సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలోని జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. గత రెండు ఐసీసీ టోర్నమెంట్‌లను గెలుచుకుని ఇప్పుడు మూడోసారి ట్రోఫీ గెలిచే అరుదైన అవకాశానికి అడుగు దూరంలో నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో భారత్ స్థిరమైన ప్రదర్శనతో ముందుకు కొనసాగుతుంది. కీలక సమయాల్లో బ్యాటింగ్ విభాగం జట్టును ఆదుకోగా, బౌలర్లు కూడా ఒత్తిడి సమయంలో కీలక వికెట్లు తీసి టీమ్ విజయానికి దోహదపడుతున్నారు. ఇదిలా ఉండగా ఫైనల్ మ్యాచ్‌కు ముందు మరో విషయం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తారా అనే ప్రశ్న.. 

2023లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ కూడా ఇదే నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా స్టేడియానికి వచ్చి మ్యాచ్‌ను వీక్షించారు. అయితే ఈసారి ఆయన హాజరు గురించి ఇప్పటి వరకు అధికారిక సమాచారం రాలేదు. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధాని షెడ్యూల్‌లో మార్పులు ఉండకపోవచ్చే తెలుస్తుంది. ఆదివారం రోజు మోడీ షెడ్యూల్ కూడా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. న్యూ ఢిల్లీలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.33,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్ విస్తరణకు సంబంధించిన ప్రాజెక్టులతో పాటు సుమారు రూ.18,300 కోట్ల విలువైన పనులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇందులో రెండు కొత్త మెట్రో కారిడార్లు కూడా ఉండనున్నాయి.
 
అయితే స్టేడియానికి ప్రధాని మోడీ వచ్చిన రాకపోయినా.. అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌పై అభిమానుల సందడి ఏమాత్రం తగ్గదు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌లు గతంలో ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించాయి. ఈ రెండు జట్లు కూడా ఒత్తిడి పరిస్థితుల్లో అద్భుతంగా ఆడగలవు.. అందువల్ల ఈ ఫైనల్ మ్యాచ్ కూడా హై వోల్టేజ్ పోరుగా మారే అవకాశం ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. భారత్‌కు ఇది చరిత్ర సృష్టించే అవకాశం కాగా, న్యూజిలాండ్‌కు మరోసారి టైటిల్ గెలుచుకునే అవకాశం లభించినట్లు అయింది. 
 

©️ VIL Media Pvt Ltd.