Reading Time: 2 minutes
India Playing Xi Vs Nz T20 World Cup 2026 Final Possible Changes In Team India Are

India Playing XI vs NZ: మరొకరోజు అంతే.. టీ20 ప్రపంచకప్ విజేత ఎవరో తేలనుంది. ఇందుకోసం అహ్మదాబాద్ వేదికగా ఆదివారం నాడు భారత్, న్యూజిలాండ్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. అయితే మ్యాచ్ లో భారత్ గెలిచేందుకు ఎవరిని ఎలా వాడుకోవాలో.. ఏ ఆటగాడిని ప్లేయింగ్ XI లో చేర్చాలో అయోమయంలో పడిపోయింది. దీనికి కారణం ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన వరుణ్ చక్రవర్తి సెమీఫైనల్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అతను వేసిన నాలుగు ఓవర్లలో 64 పరుగులు ఇచ్చాడు. అయినప్పటికీ ఆ మ్యాచ్‌లో భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.

Ind vs NZ: న్యూజిలాండ్‌కు అసలైన మొగుడు కెప్టెన్ సూర్య.. కివీస్‌పై దుమ్మురేపిన టాప్ 5 భారత బ్యాటర్లు వీరే!

నిజానికి సూపర్ 8 మ్యాచ్ లు మొదలైనప్పటి నుంచి వరుణ్ చక్రవర్తి తన అసలైన రిథమ్‌ ను కోల్పోయినట్లుగా కనపడుతుంది. దీనితో జట్టు మేనేజ్మెంట్‌ ఆందోళనకు గురి అవుతుంది. సెమీఫైనల్‌కు ముందు బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ అతనికి మద్దతుగా మాట్లాడినా, అతని స్థానం ప్లేయింగ్ XIలో ఉంటుందా..? ఉండదా..? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వరుణ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. ‘ఓవర్ థింకింగ్’ అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి బంతి తర్వాత గత బంతి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నెక్స్ట్ బంతిపై దృష్టి కోల్పోతున్నాడు. సెమీఫైనల్ మ్యాచ్‌ లో వికెట్ కీపర్ సంజూ పలుమార్లు అతనితో మాట్లాడి ఫోకస్ మార్చేందుకు ప్రయత్నించిన దృశ్యాలు కూడా కనిపించాయి.

ఈ పరిస్థితుల్లో జట్టు మేనేజ్మెంట్ ఇప్పుడు మార్పులపై ఆలోచనలో పడింది. ముఖ్యంగా బెంచ్‌పై ఉన్న కుల్దీప్ యాదవ్ కు అవకాశం ఇవ్వాలనే చర్చ మొదలైంది. అంతేకాదు జట్టులో ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా ఉన్న శివమ్ దూబే కూడా ఈ టోర్నీలో 14.12 ఎకానమీ రేట్ తో పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఐదో బౌలర్ ఫామ్‌ లో లేకపోవడం భారత్‌కు తలనొప్పిగా మారింది. ఇన్ని జరుగుతున్న ఓ విషయం వరుణ్‌కు అనుకూలంగా ఉంది. సాధారణంగా ఫామ్ లో ఉన్న జట్టు నుండి పెద్ద మార్పులు చేయడానికి టీమ్ మేనేజ్మెంట్ ఆసక్తి చూపదు.

IND vs NZ: టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్.. గెలుపును సూచిస్తున్న కారణలిదిగో..!

ఫైనల్ జరగున్న నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ బ్లాక్ అండ్ రెడ్ సోయిల్ మిశ్రమంగా ఉండనుందని సమాచారం. ఈ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి భారత్ అదనపు ఫాస్ట్ బౌలర్‌ను ఆడించే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో మహమ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దీనికి కారణం ఇదే మైదానంలో సౌతాఫ్రికా జట్టు అదనపు ఫాస్ట్ బౌలర్‌ను ఉపయోగించి విజయవంతమైంది. భారత్ కూడా అదే వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంటే మాత్రం.. వరుణ్ స్థానంలో సిరాజ్‌కు అవకాశం రావచ్చు.

ఇవన్నీ ఓ వైపు ఉంటే మరోవైపు న్యూజిలాండ్ జట్టులో నాలుగు ఎడమచేతి బ్యాటర్లు ఉండటం వల్ల ఆఫ్ స్పిన్నర్‌ ను ఆడించడం కూడా భారత్‌కు ప్రయోజనకరంగా ఉండొచ్చు. కాబట్టి వాషింగ్టన్ సుందర్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. అయితే అతన్ని జట్టులోకి తీసుకుంటే ఎవరిని తప్పించాలన్న విషయం అర్థమవుతుంది. వరుణ్‌ ను తీసేసి వాషింగ్టన్‌ను ఆడించడం అంత సులభం కాదు. మరోవైపు సెమీఫైనల్‌లో అద్భుతంగా రాణించిన అక్షర్ పటేల్ ను కూడా జట్టు నుంచి తప్పించడం కష్టమే. చుడాలిమరి టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో..