July 9, 2026

Janhvi Kapoor: కాలి నడకన శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌.. వీడియో వైరల్

Janhvi Kapoor: కాలి నడకన శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌.. వీడియో వైరల్
Reading Time: < 1 minute

Janhvi Kapoor: కాలి నడకన శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌.. వీడియో వైరల్

Caption of Image.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, శుక్రవారం (మార్చి 6, 2026న) తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. జాన్వీ తన 29వ పుట్టినరోజు సందర్భంగా అలిపిరి మెట్లపై నడుచుకుంటూ తిరుమల కొండపైకి చేరుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి నుంచి ప్రయాణం ప్రారంభించిన జాన్వీ, కొండపైకి నడిచి చేరుకుని అక్కడే రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం ఆమెకు విఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయగా, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాన్వీ కపూర్‌తో పాటు నటి మహేశ్వరి సైతం స్వామివారిని దర్శించున్నారు. సుమారు 11 కిలోమీటర్ల పొడవు, 3500కు పైగా మెట్లు ఉన్న ఈ పవిత్ర మార్గాన్ని భక్తులు విశ్వాసంతో ఎక్కి స్వామివారి దర్శనం పొందడం విశేషం. 

అయితే, అలిపిరి వద్ద పూజలు చేసిన జాన్వీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెల్లటి కుర్తా ధరించి చెవుల్లో ఇయర్‌ఫోన్లు పెట్టుకుని మెట్లు ఎక్కుతూ జాన్వీ కపూర్ కనిపింస్తూ ఆకట్టుకుంది.

►ALSO READ | Karmeni Selvam: తెలుగు–తమిళ భాషల్లో సముద్రఖని మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

అయితే, పుట్టిన రోజు, పండగలు, పర్వదినాలు ఇంకా పలు ప్రత్యేక సందర్భాల్లో ఏడుకొండల వాడిని దర్శించుకోవడం జాన్వీకి చాలా ఇష్టం. గడిచిన పుట్టినరోజు నాడు కూడా జాన్వీ మోకాళ్లపై తిరుమల మెట్లెక్కుతున్న వీడియో సైతం ఇపుడు వైరల్ అవుతోంది.

©️ VIL Media Pvt Ltd.