
మన తెలంగాణ/హైదరాబాద్: ‘అవును, ఈ దేశం కోసం నేను ప్రధానిని అవుతా..’ అని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సం కేతం ఇచ్చారు. ఈ ఆసక్తికర పరిణామం సోమవారం వికారాబాద్, అనంతగిరి హి ల్స్‌లోని హరిత రిసార్ట్‌లో చోటుచేసుకుం ది. పది రోజులుగా జరుగుతున్న తెలుగు రాష్ట్రాల డిసిసి అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశానికి రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి డిసిసి అధ్యక్షులనుద్దేశించి ప్రసంగిస్తూ కష్టాల్లో ఉన్న దేశం కోసం రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని, అదే మన ల క్షమని చెప్పడంతో సభికులు కేరింతలు కొడుతూ, కరతాళధ్వానాలు చేశారు. తెలుగులో ముఖ్యమంత్రి ఏమి చెప్పారో, స భికులు ఎందుకు హర్షద్వానాలు చేస్తున్నా రో రాహుల్‌కు అర్థం కాక పక్కనే ఉన్న పిసి సి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను అడి గి తెలుసుకున్నారు.
దీంతో రాహుల్ వెంట నే స్పందిస్తూ తన బొటన వేలిని చూపించడం తో సభికులు మరోసారి చేసిన కరతాళధ్వనులు, కేరింతలు మిన్నుముట్టాయి. దీం తో రాహుల్ చిరుదరహసం చేస్తూ సభికుల కు అభివాదం చేశారు. సిఎం రేవంత్‌రెడ్డి తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఈ దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాన మం త్రి కావాల్సిందేనని అన్నారు. రాహుల్ జీ కుటుంబంలో తాత, నానమ్మ, తండ్రి ప్రధాన అయ్యారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ప్రధాని కావాల్సిందేనని అన్నారు. అయితే రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై వ్యామోహం లేదన్నారు. రాహుల్ అత్యంత సాధారణ వ్యక్తిలా అందరిలో కలిసిపోతుంటారని ఆయన తెలిపారు. రాహుల్ ప్రధాని కావాలని తాను సిఎంగా అడగడం లేదని సామాన్య కార్యకర్తగా కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.
19 ఏళ్లకే జెడ్‌పిటిసి నుంచి సీఎం అయ్యాను
జెడిపిటిసి అయిన తర్వాత పందోమ్మిది ఏళ్ళకే తాను సిఎం కాగలిగానని అన్నారు. అంతకు ముందు పార్టీలో కూడా పదవులు నిర్వహించానని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేగా మంచి అనుభవం పొందానని, తాను ప్రజా జీవితంలో ఎప్పుడూ ఫైరవిలు చేయలేదన్నారు. ప్రజా సమస్యలపైన గళం వినిపిస్తే తనపై కేసులు పెట్టారని ఆయన తెలిపారు. నిన్న కూడా కోర్ట్‌కు వెళ్ళానని ఆయన చెప్పారు. అంతేకాకుండా పరువు నష్టం దావాలు కూడా వేశారని ఆయన తెలిపారు. ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ., రాహుల్ ఇతర అగ్రనేతల వల్లే రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగామని ఆయన చెప్పారు.
స్పీకర్ తేనేటి విందు
ఇదిలాఉండగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం సాయంత్రం వికారాబాద్‌లో తేనేటి విందు ఇచ్చారు. ఈ విందుకు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క. టి.పిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, అజహరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, అసెంబ్లీ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.