Reading Time: < 1 minute

ENG vs PAK: తడబడిన పాకిస్తాన్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే.. ?

Caption of Image.

ENG vs PAK: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా పల్లెకెలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పాకిస్తాన్ తడబడింది.  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.  టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్న పాక్ కి ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ సైమ్ ఆయూబ్ (7) మరోసారి విఫలమైయ్యాడు. జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో ఆయూబ్ జేమీ ఓవర్టిన్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 

అనంతరం క్రీజులోకి వచ్చిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. లియామ్ డాసన్ బౌలింగ్ లో జేమీ ఓవర్టీన్ కి క్యాచ్ ఇచ్చి సల్మాన్ అఘా (5) అవుట్ అయ్యాడు. పవర్ ప్లేలోనే కీలకమైన రెండు వికెట్లను కోల్పోయిన, మరో పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (63) చెలరేగి ఆడటంతో హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత ఎల్బీడబ్ల్యూ చేశాడు జేమీ ఓవర్టిన్. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన  సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజామ్, ఫఖార్ జమాన్ కాసేపు బ్యాట్ ఝలిపించారు. కానీ, పాక్ స్కోర్ బోర్డు నెమ్మదిగా ముందుకు సాగింది. 

►ALSO READ | Shreyas Iyer: బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న శ్రేయస్ అయ్యార్.. ఎందుకో తెలుసా?

ఇక బాబర్ ఆజామ్ (25) ని జేమీ ఓవర్టిన్ క్లిన్ బౌల్డ్ చేయగా, ఆదిల్ రషీద్ బౌలింగ్ లో  ఫఖార్ జమాన్ (25) భారీ షాట్ ఆడబోయి లియామ్ డాసన్ కి క్యాచ్ ఇచ్చి డకౌట్ కి చేరుకున్నాడు. ఉస్మాన్ ఖాన్ (9), మొహమ్మద్ నవాజ్ (0), షాహీన్ అఫ్రిది (2) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు..  అయితే చివర్లో షాదాబ్ ఖాన్ 10 బంతుల్లో 22 పరుగులు చేయడంతో పాకిస్తాన్ 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లియామ్ డాసన్ మూడు వికెట్లు తీసుకుని పాకిస్తాన్ బ్యాటర్ల నడ్డి విరిచగా.. జేమీ ఓవర్టిన్, జోఫ్రా అర్చర్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, ఆదిల్ రషీద్ ఒక వికెట్ తీసుకున్నాడు. 
 

©️ VIL Media Pvt Ltd.