Reading Time: < 1 minute
Weather: ఇదెక్కడి ట్విస్ట్.! ఆంధ్రా, తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఇదిగో.. నెలాఖరున అకాల వర్షాలు

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వింటర్ సీజన్ దాదాపుగా ముగిసింది. ఇక ఎండాకాలం మొదలుకానుంది. కొన్ని రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు, నైట్ టెంపరేచర్లు 17-19 డిగ్రీలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. క్రమంగా ఉష్ణోగ్రతల్లో భారీ పెరుగుదల ఉంటుందన్నారు. అలాగే ఫిబ్రవరి 25-28 మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని పేర్కొంటున్నారు.

మరోవైపు ఏపీ విషయానికొస్తే.. ఉత్తర, దక్షిణ కోస్తాంద్రాలో ఇవాళ, రేపు పొడి వాతావరణం.. అలాగే పొగమంచు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశముందన్నారు. అలాగే ఎల్లుండి అంతా పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని చెప్పారు. రాయలసీమలో కూడా మూడు రోజులు పొడి వాతావరణం ఉండటంతో పాటు, పొగమంచు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. అటు రాగల 2 రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా.. రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది.