Reading Time: < 1 minute

చంద్రబాబు, లోకేష్ కు ముద్రగడ పద్మనాభం లేఖ.. ఏపీలో మోదీ ఎమర్జెన్సీ విధించాలని డిమాండ్..

Caption of Image.

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి.. వైసీపీ నేతల ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగుతున్న క్రమంలో రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను ఉద్దేశించి సంచలన లేఖ రాశారు కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం. సోమవారం ( ఫిబ్రవరి 2 ) రాసిన ఈ లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి…

ఏపీలో గాడితప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నారా అంటూ లేఖలో ప్రశ్నించారు ముద్రగడ. రాష్ట్రంలో వైసీపీ నేతలను అవమానించడం సరికాదని..ఏపీలో మోదీ ఎమర్జెన్సీ విధించాలని అన్నారు ముద్రగడ. ప్రభుత్వం కాపులను టార్గెట్ చేసిందని ఆరోపించారు.

►ALSO READ | శ్రీశైలంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. మంత్రులు.. అధికారులు సమీక్షా సమావేశం

బీసీ రిజర్వేషన్ల విషయంలో హామీ ఇచ్చి మోసం చేశారని..కాపు సామాజికవర్గం కోపంగా ఉన్నప్పటికీ..పవన్‌పై ఉన్న ప్రేమతోనే మద్దతు ఇచ్చారని అన్నారు ముద్రగడ. ఇదిలా ఉండగా… వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ కార్యకర్తల దాడులు తీవ్ర కలకలం రేపాయి. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబును ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించగా.. జోగి రమేష్ పై మరో రెండు కేసులు నమోదు చేసి అరెస్ట్ కి సిద్ధమవుతోంది ప్రభుత్వం.

కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు వైసీపీ శ్రేణులు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చేస్తోందని మండిపడుతున్నారు వైసీపీ శ్రేణులు.

©️ VIL Media Pvt Ltd.