Reading Time: < 1 minute

వైభవంగా నరసింహ స్వామి రథోత్సవం

Caption of Image.

ఎడపల్లి, వెలుగు :  మండలంలోని జానకంపేట్ గ్రామ సమీపంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ  బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం స్వామి వారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి.

మండలవాసులతోపాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అంతకుముందు యజ్ఞం నిర్వహించారు. సర్పంచ్ అనురాధ, ఉపసర్పంచ్ కృష్ణ, ఆలయ ఈవో వేణు, రాధాకిషన్ గౌడ్, మిద్దె చిన్నయ్య, మిద్దె నరేందర్ తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.