Reading Time: < 1 minute

మేడారానికి సారలమ్మ.. మహాజాతరలో తొలిఘట్టం

Caption of Image.

మేడారం భక్త జనసంద్రమైంది. ఇవాళ ( జనవరి 28 ) కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ గద్దెకు చేరుకోవడంతో మహాజాతరకు అంకురార్పణ జరిగింది.

ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కన్నెపల్లి ఆలయంలో వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు చేశారు. పూజారి కాక సారయ్య, కాక కిరణ్ కన్నెపల్లిలోని ఆలయంలో పుట్టమన్నుతో అలికి ముగ్గులు పెట్టారు. అదే సమయంలో మేడారంలోని సమ్మక్క గుడి దగ్గర కూడా పూజలు నిర్వహించారు. 

పూజారి సిద్దవేయిన మునీందర్ తన ఇంటి వద్ద పూజలు నిర్వహించి పసుపు, కుంకుమలు తీసుకొని సమ్మక్క గుడికి చేరుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ అలికి ముగ్గులు పెట్టారు.

సారలమ్మ భర్త గోవిందరాజు నిన్న కొండాయి నుంచి మేడారం వస్తున్నారు. కాసేపట్లో పగిడిద్దరాజు, గోవింద రాజు మేడారం గద్దెలకు చేరుకుంటారు. దీంతో మహాజాతర ప్రారంభమవుతుంది.

©️ VIL Media Pvt Ltd.