Reading Time: < 1 minute

అమ్మాయిల ఆశయాలే స్ఫూర్తి.. ‘క్రేజీ కళ్యాణం’ గురించి దర్శకుడు బద్రప్ప గజుల ఆసక్తికర వ్యాఖ్యలు 

Caption of Image.

ఫన్‌‌‌‌‌‌‌‌తోపాటు  హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో సాగే ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనరే ‘క్రేజీ కళ్యాణం’ అని చిత్ర దర్శకుడు బద్రప్ప గాజుల అన్నాడు.   నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని   బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు.  దసరా సందర్భంగా  అక్టోబర్ 16న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బద్రప్ప గాజుల మాట్లాడుతూ ‘ఇది  తెలంగాణ  నేపథ్య సినిమా అయినా అందరికీ అర్థమయ్యేలా మాటలు, యాస ఉంటాయి.  చదువుకునే వయసులోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడం, వారి ఆశయాలను పట్టించుకోకపోవడం నన్ను ఆలోచింపజేసింది. ఆ పాయింట్‌‌‌‌‌‌‌‌ నుంచే ఈ కథ పుట్టింది.  

సంప్రదాయం, పరువు పేరుతో అమ్మాయిల కలలను అణచివేయకుండా, వారి మనసును అర్థం చేసుకోవాలనే సందేశాన్ని వినోదాత్మకంగా చూపించబోతున్నాం.  కథ వినగానే అనుపమ పరమేశ్వరన్‌‌‌‌‌‌‌‌కు బాగా నచ్చింది. ఆమె పెర్ఫార్మెన్స్  ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటించారు. వీకే నరేష్​ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.  గోరటి వెంకన్న మూడు పాటలు రాశారు. ఆయన జీవితాన్ని చూసే విధానం పాటలో కనిపిస్తుంది.  ప్రొడ్యూసర్ జగన్ మోహన్ రెడ్డి  సంస్థలో నేను కొన్ని యాడ్స్ చేశాను. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లో నా పనితనం, నిజాయితీ చూసి నాపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చారు.   ప్రస్తుతం నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తా’ అని చెప్పాడు. 

©️ VIL Media Pvt Ltd.