Reading Time: < 1 minute
Rt78 Movie Launch Ravi Teja Priyanka Mohan Cast Announced Title Launch Soon

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ అభిమానులకు గుడ్ న్యూస్. ఇరుముడి ఘనవిజయంతో మాస్ మహారాజా రవితేజ మాంచి జోరుమీదున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా జెట్ స్పీడ్ లో  మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాడు రవితేజ. కెరీర్‌లో 78వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే వివేక్ ఆత్రేయ, రవితేజతో చేయబోయే ఈ సినిమా నేడు పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియాంక మోహన్ మరియు అనశ్వరా రాజన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు జె.డి. చక్రవర్తి విలన్ పాత్రలో కనిపిస్తుండగా డైరెక్టర్ కమ్ నటుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో మెరవనున్నాడు.  భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. సినిమా టైటిల్ మరియు పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.  బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా అవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. రవితేజ మరియు జేడీ చక్రవర్తిల మధ్య వచ్చే ముఖాముఖి సన్నివేశాలు థియేటర్లలో నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయని భావిస్తున్నారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాకు ‘తులాభారం’ అనే  టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్.