
ఇంట్లో మనుషులే కాదు.. పెంపుడు జంతువులకూ ప్రత్యేక స్థానం ఉంది! వాటితో ఆటలు.. అల్లరి.. అనుబంధాలు.. అన్నీ ప్రత్యేకమే! అలాంటి పెట్ లవర్స్ కోసం హైదరాబాద్‌లో తొలిసారిగా పెట్ ఫెడ్ 2026 సందడి చేయనుంది. జాగిలాల కేరింతలు.. పెంపుడు జంతువుల వినోదాలు.. సరికొత్త పెట్ బ్రాండ్లతో రెండు రోజుల పాటు నగరం పెట్స్ మయంగా మారనుంది!
పెంపుడు కుక్కల కోసం హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారి పెట్ ఫెడ్ పేరిట ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. పెట్ ఫెడ్ హైదరాబాద్ 2026 పేరిట నవంబర్ 21, 22 తేదీల్లో నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటరులో వేడుకలు జరుపనున్నారు. రెండు రోజులపాటు ఉదయం11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ ఉత్సవం పెంపుడు జంతువులకు, వాటి కుటుంబాలకు కొత్త అనుభవాన్ని అందించనుంది. జాగిలాలతో పెట్ లవర్స్ అనుభవాలు, పెంపుడు జంతువుల బ్రాండ్‌లు, వాటి వినోదాలను ఈ వేడుక ఒకే వేదికపైకి తీసుకురానుంది.
పెట్ ఫెడ్‌లో పెంపుడు కుక్కల యజమానుల కోసం ఎన్నెన్నో ఆకర్షణలు ఉంటాయి. పెంపుడు కుక్కల కోసం ఈ ఉత్సవంలో ఆటలు, సవాళ్లు, ఇంటరాక్టివ్ కార్యకలాపాలు ఉంటాయి. కుక్కలను దత్తత తీసుకునే అవకాశాలు, పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక స్టాల్స్, వివిధ బ్రాండ్‌ల నుంచి ఆహారం, వివిధ ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంటాయని పెట్ ఫెడ్ నిర్వాహకులు చెప్పారు. ఈ ప్రదర్శన కోసం ఎర్లీ బర్డ్ పాస్‌లు కూడా అందుబాటులో ఉంచారు. వీటిలో కస్టమైజబుల్ పెట్ ఫెడ్ టోట్ బ్యాగ్, ప్రీ-పార్టీలకు ఆహ్వానాలు, కచ్చితమైన గూడీస్, ఉత్సవంలో రెండు రోజులకు ప్రవేశం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
ఎన్నెన్నో పెట్ ఈవెంట్స్
హైదరాబాద్ నగరంలో అక్టోబరు నెలలో ఫీలైన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్యాట్ షో, నవంబరు నెలల్లో జాగిలాల కోసం పెట్ ఫెడ్ కార్యక్రమాలు చేపట్టనుండటంతో హైదరాబాద్ పెట్ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెట్ లవర్స్ కోసం నగరంలో రెండు వేర్వేరు ఈవెంట్‌లు జరగనుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. హైదరాబాద్ పెట్ ఈవెంట్స్ 2026 : ఫీలైన్ క్యాట్ ఇండియా ఛాంపియన్ షిప్ క్యాట్ షో అక్టోబరు11న, హెచ్ఎఫ్ కన్వెన్షన్ , పది జాతులకు చెందిన 300కు పైగా పెంపుడు పిల్లులు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి.
ఈ షోలో ఇంటర్నేషనల్ జడ్జిలతో చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తారు. ఇండియన్ నేటివ్ క్యాట్ బ్రీడ్స్ ప్రదర్శన కూడా ఉంటుంది.క్యాట్ విజేతలకు ట్రోఫీలు, గిఫ్ట్ హ్యాంపర్లు ప్రదానం చేయనున్నారు.పెంపుడు జంతువులు లేని వారు కూడా ఈ షోకు హాజరై ఆనందించవచ్చునని, షో కోసం టిక్కెట్లు బుక్ చేసుకోవాలని హైదరాబాద్ కు చెందిన ఫీలైన్ క్యాట్ ఇండియా ప్రతినిధి సమజ్ చెప్పారు.ఈ షోలో కెమెరాలకు అనుమతి ఉందన్నారు. అక్టోబరు నెలలోనే పెట్ కాంక్లేవ్ 2026 కూడా నిర్వహిస్తున్నారు. పెట్ ఫెడ్ హైదరాబాద్ 2026 ఈవెంట్ నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటరులో నవంబరు 21వతేదీ నుంచి జరగనుంది. ఈ ప్రదర్శనలో డాగ్ గేమ్స్, చాలెంజెస్, ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ఉంటాయని పెట్ ఫెడ్ ప్రతినిధి చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్‌లో పెటెక్స్ ఇండియా ఆధ్వర్యంలో పెట్ కేర్ పరిశ్రమకు చెందిన ఎగ్జిబిషన్ బీ2 బీ2 సి పెట్ కేర్ ఎక్స్ పో నిర్వహించనున్నారు.
హైదరాబాద్ డాగ్ వాకర్స్
హైదరాబాద్ నగరంలో పెంపుడు కుక్కలకు డైలీవాక్, హెల్త్ ఎక్సర్ సైజులు, కేర్, కంపెనీ, పికప్, డ్రాప్లలో శిక్షణ ఇస్తున్నారు. మీ పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకువెళ్లాలనుకుంటున్నారా? మీ కుక్కకు వివిధ రకాల వ్యాయామాలు చేయించాలనుకుంటే పెట్ లవర్స్ నగరంలోని పెట్స్ వరల్డ్‌ను సంప్రదించవచ్చంటున్నారు డాగ్ వాకర్స్.
హోం పెట్ బోర్డింగ్
పెట్ పేరెంట్స్ ఏవైనా పనుల కోసం దేశ, విదేశాలకు వెళుతుంటే మీ పెంపుడు జంతువులకు ఆశ్రయం కల్పించేందుకు హైదరాబాద్ నగరంలో హోం పెట్ బోర్డింగ్ సంస్థలు వెలిశాయి. మీరు ఇల్లు వదిలేటపుడు మీ పెట్స్‌ను మేం ప్రేమగా, కేర్‌తో సేఫ్టీగా చూసుకుంటామని, మీ పెంపుడు జంతువులకు మంచి వసతి, సౌకర్యాలు కల్పిస్తామని పెట్ బోర్డింగ్ సంస్థలు చెప్తున్నాయి. మీ పెంపుడు జంతువులకు అనువైన, సౌకర్యవంతమైన ఆశ్రయం, నాణ్యమైన పుష్టికరమైన హైజీనిక్ ఆహారం అందిస్తూ 24/7 నిపుణుల పర్యవేక్షణలో ప్రేమతో చూసుకుంటామని హ్యాపీ పెట్స్ సంస్థలు వెల్లడించాయి.
పెంపుడు జంతువులు కేవలం ఇంట్లో ఉండే జీవులు కాదు.. అవి కుటుంబంలో భాగం.. మనసుకు నేస్తాలు! అలాంటి మూగజీవాలతో మరింత అనుబంధాన్ని పెంచుతూ వాటి సంరక్షణకు సంబంధించిన అనుభవాలను పంచుకునే వేదికగా పెట్ ఫెడ్ నిలవనుంది. మనుషులకు పండుగలు ఎన్నో.. మరి మనసుకు దగ్గరైన పెట్స్‌కు ఈ పండుగ ప్రత్యేకమే కదా!
పెట్ వెడ్డింగ్ ఈవెంట్స్
మీ పెంపుడు జంతువులకు పెళ్లి, పుట్టినరోజు వేడుక చేయాలంటే హైదరాబాద్ నగరంలో పెట్స్ వెడ్డింగ్ ఈవెంట్ సంస్థలు వెలిశాయి. ప్రొఫెషనల్ పెట్ కేర్, హ్యాండ్లింగ్, వెడ్డింగ్ అసిస్టెన్స్, పెట్స్ పార్టీలు నిర్వహిస్తామంటున్నారు పెట్స్ వరల్డ్ నిర్వాహకులు. వెడ్డింగ్ పెట్ కేర్ సర్వీసులు, పెట్ వెడ్డింగ్ అటెండెంట్, పెట్ హాస్పిటాలిటీ సర్వీసులు, వెడ్డింగ్ డే పెట్ కేర్ సర్వీసులు అందజేస్తామని పెట్స్ వరల్డ్ ప్రతినిధులు చెప్తున్నారు.
హోం బేస్డ్ క్యాట్ బోర్డింగ్
మీ పెంపుడు పిల్లులను సంతోషంగా ఉంచేందుకు తాము హోం బేస్డ్ క్యాట్ బోర్డింగ్ సర్వీసులు అందిస్తున్నామని పెట్స్ వరల్డ్ నిర్వాహకులు చెప్తున్నారు. మీ పెంపుడు పిల్లిని బొమ్మలతో ఆడించడం, మీరు సిఫారసు చేసిన ఆహారాన్ని అందించడంతోపాటు మీ పిల్లిని లవ్ అండ్ కేర్‌తో చూసుకుంటామని నిర్వాహకులు హామి ఇచ్చారు. పెట్స్ కోసం హైదరాబాద్ నగరంలో పెంపుడు జంతువుల సంఖ్య పెరుగుతుండటంతో వాటి కోసం పెట్ షాపులు, స్పాలు, క్లినిక్‌లు కూడా వెలిశాయి.
పెట్ గ్రూమింగ్ సర్వీసులు ఎట్ డోర్ స్టెప్
హైదరాబాద్ నగరంలో పెంపుడు కుక్కలు, పిల్లుల కోసం డోర్ స్టెప్ పెట్ గ్రూమింగ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. పెంపుడు జంతువు ఏదైనా వాటికి ఇంటివద్దకే వచ్చి బాత్, హెయిర్ డ్రై, నెయిల్ ట్రిమ్మింగ్, ఈయర్ క్లీనింగ్ సర్వీసులు అందిస్తున్నారు. సురక్షితమైన హైజీనిక్ ఉత్పత్తులను ఉపయోగించి పెట్స్ గ్రూమింగ్ చేస్తున్నామని పెట్స్ వరల్డ్ ప్రతినిధులు చెబుతున్నారు. అనుభవం గల గ్రూమర్స్ నాణ్యమైన ఉత్పత్తులతో ప్రొఫెషనల్ గా గ్రూమింగ్ చేస్తామని పలు సంస్థలు ప్రకటించాయి.