టెక్నాలజీ ఎంత వేగంగా పెరిగిపోతుందో, యువత కూడా దానికి అంతకంటే ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. తనపై తాము కాకుండా ఎక్కువగా టెక్నాలజీపైనే ఆధారపడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలాగే టెక్నాలజీపై ఆధారపడటం పెరుగుతుంటే, అది వారి మానసిక ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపే ప్రభావం ఉందని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
విద్యార్థుల హోమ్ వర్క్, ఉద్యోగుల ఈమెయిల్స్ రాయడం నుంచి ఒంటరితనం పొగొట్టుకోవడానికి కూడా ఏఐని ఒక మంచి స్నేహితుడిగా వాడుతున్నారని వారు తెలియజేయడం జరిగింది. ఇది యువతపై రాను రాను చాలా ప్రభావం చూపనన్నదంట. ముఖ్యంగా దీని వలన ఒక వ్యక్తి తాను సొంతంగా ఆలోచించుకునే శక్తిని కోల్పోవడం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏఐని ఎక్కువగా వాడుతూ ఉండటం వలన ఒంటరితనం పెరగడం, మనుషులతో సంబంధాలు దెబ్బ తినడం వంటి సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉన్నదంటే. అంతే కాకుండా దీనికి ఎక్కువగా అడక్ట్ అవ్వడం వలన కొన్ని సార్లు ఏఐ లేకపోతే ఆందోళన చిరాకు, నిద్రలేమి వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో మానసిక కుంగుబాటు వంటి లక్షణాలు యువతలో చూడొచ్చు. ఇదో పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందంట
కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సర్వేలో 2026 -26లో ఈ విషయాన్నే ప్రస్తావించడం జరిగింది. ఏఐకి ఎక్కువగా అలవాటు పడటం వలన సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోవడం జరుగుతుంది. అందువలన ఏఐని సృజనాత్మకు సాధనంగా కాకుండా, ఆలోచనకు ప్రత్యామ్నాయంగా వాడటం వలన భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందువలన యువత, విద్యార్థులు దీనిని సరైన మోతాదులో వాడటం చాలా మంచిది. సొంతంగా ఆలోచించి, తర్వాత ఏఐ సహాయం తీసుకోవాలి. పూర్తిగా ఏఐ పైనే ఆధారపడకూడదు అని నిపుణులు తెలియజేస్తున్నారు




