Reading Time: < 1 minute

అక్టోబర్ 30న ‘A’ మూవీ రిలీజ్.. ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రాహుల్ విజయ్ సినిమా

Caption of Image.

రాహుల్ విజయ్, అర్చన అయ్యర్  జంటగా సాయి బాలి దర్శకత్వంలో  కనకరావు తొనంగి, అభిషేక్ కె,  ఎడిటర్ గ్యారీ బీహెచ్  నిర్మిస్తున్న చిత్రం ‘అ’. అక్టోబర్ 30న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘ఇదేనా ఇదేనా’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేయగా, సుమన్ చిక్కాల లిరిక్స్ అందించాడు. షణ్ముఖ భరద్వాజ్ పాడాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో రాహుల్ విజయ్ మాట్లాడుతూ ‘ఇదొక మిస్టీరియస్ ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.

ఇందులో నేను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించబోతున్నా’ అని చెప్పాడు.  కెరీర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలోనే ఇలాంటి మంచి పాత్ర చేయడం లక్కీగా ఫీలవుతున్నానని అర్చన అయ్యర్ చెప్పింది.   అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ, అనుమానం,  అసాంఘీకం,  అమానుషం ఈ పదాల మధ్యే ఈ కథ సాగుతుంది అని  దర్శకుడు సాయి బాలి చెప్పాడు. ఈ చిత్రంతోపాటు ఇందులోని పాటలు కూడా అందరికీ నచ్చుతాయని నిర్మాతలు అన్నారు.

©️ VIL Media Pvt Ltd.