Reading Time: < 1 minute

సీజేపీ నేతలను రిలీజ్ చేయకుంటే నిరాహార దీక్ష చేస్తా: వాంగ్ చుక్

Caption of Image.

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు, రాజకీయ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చుక్ తీవ్రంగా మండిపడ్డారు. అరెస్టు చేసిన నాయకులను ఆదివారంలోగా విడుదల చేయకపోతే నిరవధిక నిరాహార దీక్ష లేదా పాదయాత్ర చేపడతానని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. రాజకీయ నాయకుల నిర్బంధం, ఢిల్లీలో విధించిన ఆంక్షలు, ప్రజా రవాణా, ఇంటర్నెట్ సేవల నిలిపివేత వంటి పరిణామాలను ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆయన అభివర్ణించారు. ఈ సమయంలో వివిధ వర్గాల నాయకులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

©️ VIL Media Pvt Ltd.