Reading Time: < 1 minute

మంత్రాలు చేస్తున్నదని కన్న తల్లికి నిప్పు..కాలిన గాయాలతో మృతి

Caption of Image.

టేక్మాల్, వెలుగు: మెదక్ జిల్లాలో మంత్రాలు చేస్తుందనే అనుమానంతో కొడుకే కన్న తల్లిపై డీజిల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన టేక్మాల్ మండలం ఎల్లుపేట్ లో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన కర్రె దుర్గేశ్(18) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

తన తల్లి సాయమ్మ (40) మంత్రాలు చేస్తోందనే అనుమానంతో మొదటగా ఆమెపై దాడి చేశాడు. అనంతరం డీజిల్ పోసి నిప్పంటించడంతో శరీరం తీవ్రంగా కాలి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు దుర్గేశ్​ను అదుపులోకి తీసుకున్నారు.  

©️ VIL Media Pvt Ltd.