Reading Time: < 1 minute

తెల్లాపూర్ ‌‌ భూసేకరణ నోటిఫికేషన్‌‌‌‌ రద్దు..ఉద్దేశం స్పష్టంగా లేదన్నహైకోర్టు

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: భూసేకరణ ఉద్దేశాన్ని స్పష్టంగా వెల్లడించకుండా జారీ చేసిన నోటిఫికేషన్‌‌‌‌ చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చింది. మెదక్‌‌‌‌ జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌‌‌‌లో ప్రతిపాదిత టౌన్‌‌‌‌షిప్‌‌‌‌ ఏర్పాటు, భవిష్యత్తు ప్రాజెక్టుల అభివృద్ధి పేరుతో 92.39 ఎకరాల భూసేకరణకు 2006 ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్‌‌‌‌ను కోర్టు రద్దు చేసింది. దీనికి సంబంధించి 2007లో జారీ చేసిన డిక్లరేషన్‌‌‌‌ను సైతం న్యాయస్థానం కొట్టివేసింది.

ఒకవేళ ప్రభుత్వానికి ఆ భూములు నిజంగానే అవసరమైతే చట్ట నిబంధనలను అనుసరించి కొత్తగా భూసేకరణ ప్రక్రియ చేపట్టవచ్చని స్పష్టం చేసింది.సర్వే నంబర్లు 333, 334, 335, 341, 342, 343, 363, 364, 368లోని భూముల సేకరణను సవాలు చేస్తూ తెల్లాపూర్‌‌‌‌ ‘జి’ బ్లాక్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ ఓనర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌తో పాటు మరికొందరు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై జస్టిస్‌‌‌‌ వాకిటి రామకృష్ణారెడ్డి విచారణ జరిపి తుది తీర్పు వెలువరించారు. 

©️ VIL Media Pvt Ltd.