Reading Time: < 1 minute

ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ సీజన్‌‌‌‌కు రంగం సిద్ధం

Caption of Image.

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ సీజన్‌‌‌‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి దేశ వ్యాప్తంగా వివిధ వేదికల్లో మ్యాచ్‌‌‌‌లు మొదలుకానున్నాయి. డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ జమ్మూ కశ్మీర్‌‌‌‌ టైటిల్‌‌‌‌ నిలబెట్టుకోవడానికి సిద్ధమవుతుండగా, బలమైన ముంబై, కర్ణాటక, బెంగాల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ కూడా కప్‌‌‌‌ కోసం పోటీపడనున్నాయి.

ఈ సీజన్‌‌‌‌లో కేఎల్ రాహుల్ (కర్ణాటక), యశస్వి జైస్వాల్ (ముంబై), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర), వాషింగ్టన్ సుందర్ (తమిళనాడు), రజత్ పటిదార్ (మధ్యప్రదేశ్) వంటి అగ్రశ్రేణి టీమిండియా క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు.

న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌‌‌‌కు ముందు రెడ్-బాల్ క్రికెట్‌‌‌‌లో సత్తా చాటేందుకు ఈ స్టార్స్ సిద్ధమవుతున్నారు. టీమిండియాకు దూరమైన సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ..  బెంగాల్ జట్టు తరఫున ఆడి సెలెక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ నేపథ్యంలో అతడి ప్రదర్శన కీలకం కానుంది. 

బిహార్‌‌‌‌ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీతో పాటు జార్ఖండ్ యువ బ్యాటర్లు కుమార్ కుశాగ్రా, విరాట్ సింగ్ తదితరులు మరోసారి తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఈ టోర్నమెంట్‌‌‌‌లో అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల పోరు ఆసక్తికరంగా మారనుంది.

©️ VIL Media Pvt Ltd.