
- నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సపోర్ట్
న్యూఢిల్లీ: భారత్‌లోకి స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను కొందరు పెద్దలు అడ్డుకుంటున్నారంటూ స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ చేసిన ఆరోపణలను జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు తప్పుబట్టారు.
డేటా రేట్లు ప్రపంచంలోనే అత్యంత చౌకగా ఉన్నది భారత్‌లోనేనని స్పష్టం చేశారు. ఇందుకు ముకేశ్ అంబానీ జియో కూడా కారణమని పేర్కొన్నారు. అందుకే భారతీయులు రెండు సిమ్ కార్డులతో పెద్ద డేటా ప్యాకేజీలు వాడుతున్నారని వివరించారు.
చౌకైన ఔషధాలు, తక్కువ ఖర్చుతో కూడిన యూపీఐ చెల్లింపు వ్యవస్థలే భారత ఆర్థిక పోటీతత్వానికి నిదర్శనమని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహించకుండా, స్టార్టప్‌లకు పెద్దపీట వేస్తోందని అన్నారు. ప్రభుత్వ విధానాల ఫలితంగానే భారత రాకెట్ స్టార్టప్‌లు తక్కువ ఖర్చుతో రాకెట్లను తయారుచేస్తూ స్పేస్ఎక్స్ సంస్థకు సవాలుగా నిలుస్తున్నాయని, టెస్లాకు చైనా ఎలక్ట్రిక్ కార్లు పోటీ ఇచ్చినట్టే ఇదీ జరుగుతోందని శ్రీధర్ వివరించారు.