
వనపర్తి, వెలుగు : జూరాల ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒక్క ఎకరం భూమి కూడా ఎండిపోకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పంటలకు సాగునీరు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.
ఈ అంశంపై ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు లేఖ రాసి, తెలంగాణలోని జూరాల, భీమా, నెట్టెంపాడు, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పరిధిలోని పంటలను కాపాడేందుకు రోజుకు 5,000 క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు కృష్ణా నీటిని విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు.