Reading Time: < 1 minute

కేంద్ర మాజీ మంత్రి అళగిరి కుమార్తె అరెస్ట్

Caption of Image.

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం దివంగత కరుణానిధి మనవరాలు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి కుమార్తె కయాళ్‌‌‌‌విళిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌‌‌‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌‌‌‌పై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకుని అనంతరం స్టేషన్ బెయిల్‌‌‌‌పై విడుదల చేశారు. 

చెన్నైలోని అడయార్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఎస్‌‌‌‌బీఐ ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐ బ్రాంచ్ కార్యాలయం కయాళ్‌‌‌‌విళికి చెందిన వాణిజ్య భవనంలో నడుస్తోంది. ఈ బిల్డింగ్‌‌‌‌లోని లిఫ్ట్​ రిపేర్​లో ఉందని, దానిని సరిచేయించాలని కయాళ్​విళిని  బ్రాంచ్ మేనేజర్ హర్షిన్ సింగ్​ కోరారు. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా.. కయాళ్‌‌‌‌విళి ఆగ్రహంతో మేనేజర్‌‌‌‌పై చేయిచేసుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.