మనం వర్క్ చేసే ఆఫీసు సహోద్యోగితో ఇంకా మీ చిన్ననాటి స్నేహితుడితో , కాలేజీ స్నేహితుడితో, మీకు బాగా నచ్చిన స్నేహితులతో ఫ్రెండ్షిప్ డే మంచిగా సెలెబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజున మీ ప్రియమైన వారికీ ఇలా కోట్స్ పెట్టి విష్ చేయండి. ఇవి వారి రోజును మరింత చిరస్మరణీయంగా మార్చగలదు.
ఒక మనిషి మనల్ని ఎంచుకోవాలన్నా, మనం ఒకర్ని ఎంచుకోవాలన్నా ముందు కనపడాల్సిన మొట్ట మొదటిది మంచి స్నేహం.
మంచి స్నేహం నమ్మకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మనస్ఫూర్తిగా ఒకర్ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తే ప్రేమ, గౌరవం, నమ్మకం కచ్చితంగా కనపడతాయి.
స్నేహం మనకి నచ్చిన వాళ్ళతో కంటికి కనిపించని దారంతో గట్టిగా ముడిపడి ఉంటుంది. అలాంటి ఫ్రెండ్స్ మీకు ఉంటే నీలాంటి స్నేహితులు జీవితంలో దొరికిన గొప్ప వరం అని చెప్పండి. అలాంటి వాళ్లతో అంతులేని ఆనందం, అందమైన జ్ఞాపకాలు ఉంటాయి. దూరం స్నేహాన్ని ఎప్పటికి బలహీనపరచలేదు.
మీ స్నేహితుడికి నిన్ను నా ప్రాణ స్నేహితుడిగా చెప్పుకోవడం నా అదృష్టం. ఇంకా మనమిద్దరం కలిసి మరెన్నో సాహసాలు చేయాలని ఆశిస్తున్నాను. మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ప్రేమగా విష్ చేయండి. మీరు ప్రతిరోజూ నా జీవితాన్ని మరింత ప్రకాశవంతం చేస్తారని ఆశిస్తున్నాను ఇలా కూడా చెప్పొచ్చు.
నిజమైన స్నేహితుడు నీ కథ మొత్తం తెలుసుకుని నీతోనే ఉండటానికి ఇష్టపడతారు. అలాంటి స్నేహితులను అసలు వదులుకోకండి.
నీ స్నేహమే నా అతిపెద్ద బలం. జీవితం నేను ఎక్కడికి వెళ్లినా, నా హృదయంలో నీకు ప్రత్యేక స్థానం ఉంటుంది. స్నేహ దినోత్సవ శుభాకాంక్షలు, మిత్రమా అని ఇలా విష్ చేయండి.




