Reading Time: < 1 minute

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం డీపీఆర్ రెడీ: కేంద్రం

Caption of Image.

న్యూఢిల్లీ, వెలుగు:  హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు  ఉత్తర భాగానికి సంబంధించి  డీపీఆర్ రెడీ అయిందని కేంద్రం వెల్లడించింది. బుధవారం రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు.

161.518 కిలోమీటర్ల మేర 6 లేన్ల నార్త్ త్రిపుల్ఆర్‌ నిర్మాణానికి రూ. 23,935.6 కోట్ల వ్యయంతో ఆమోదం లభించిందన్నారు. 99.06 శాతం భూసేకరణ నోటిఫికేషన్లు పూర్తయ్యాయని వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలోని ఎన్‌హెచ్–167 పై గూడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు 80.01 కి.మీ మేర పనులు కేటాయించామని పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.