Reading Time: 2 minutes
Sai Pallavi Wins Hearts As Sita In Ramayana Trailer

Sai Pallavi Wins Hearts as Sita in Ramayana Trailer: దక్షిణాది స్టార్ హీరోయిన్ సాయిపల్లవి వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే తన సహజ నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సాయిపల్లవి.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలతో కెరీర్‌లో మరో కీలక దశలోకి అడుగుపెడుతున్నారు. ముఖ్యంగా ‘రామాయణ’ సినిమాతో ఆమెపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజైన ట్రైలర్‌లో సీత పాత్రలో ఆమె ఒదిగిపోయారు.

బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక రామాయణ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం తొలి భాగం 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. రెండో భాగాన్ని 2027 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నేడు రిలీజ్ అయిన రామాయణ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సాయిపల్లవి తన సహజసిద్ధమైన నటన, అభినయంతో సీతమ్మ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.

రామాయణంతో పాటు సాయిపల్లవి నటిస్తున్న మరో కీలక చిత్రం ‘OM: Chapter 1’. ఈ సినిమా 2026 అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే కాకుండా ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్‌లో కూడా సాయిపల్లవి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, విడుదల తేదీని చిత్రబృందం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ సాయిపల్లవి తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. రామాయణ, OM: Chapter 1, మణిరత్నం ప్రాజెక్ట్, రామాయణ: పార్ట్ 2 చిత్రాలతో 2026–27లో సాయిపల్లవి ఇండియాలో టాప్ స్టార్ కానున్నారు.