
US Iran War: జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకున్నారు. అమెరికా ఇరాన్‌పై మరోసారి వైమానిక దాడులు ప్రారంభించింది. గురువారం ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికన్ అధికారులు ప్రకటించారు. ఈ వారం జోర్డాన్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ, ఇరాన్‌పై భారీ దాడులు చేస్తామని హెచ్చరించారు.
అంతకుముందు జోర్డాన్‌లోని తమ స్థావరంపైకి ప్రయోగించిన క్షిపణుల్ని అడ్డుకున్నట్లు యూఎస్ తెలిపింది. ఈ దాడులకు ప్రతిగా తాము దాడులకు దిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ దాడికి కొద్ది గంటల ముందే ఇరాన్‌ను దెబ్బతిస్తామని ట్రంప్ హెచ్చరించడం గమనార్హం. “మేము వారిని ఓడిస్తాము. మేము వారిపై చాలా బలంగా దాడి చేస్తాము. వారు మూల్యం చెల్లించుకుంటారు.” అని అన్నారు.
మరోవైపు మంగళవారం రాత్రి అమెరికా, సౌదీ అరేబియాలు కలిసి ఇరాన్ మద్దతు కలిగిన మిలీషియాపై వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో 20 మంది మిలిషియా సభ్యులు చనిపోయినట్లు తెలుస్తోంది. తూర్పు ఇరాక్‌లోని మిలీషియా లాజిస్టిక్స్ కేంద్రాలు, ఆయుధ డిపోలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూల మధ్య వైట్‌హౌజ్‌లో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత అమెరికా ఇరాన్‌పై దాడులు నిర్వహించింది.
U.S. forces began launching strikes against Iran at 8 p.m. ET today. The strikes are a powerful response to yesterday’s attempted Iranian attacks on U.S. forces based in the Middle East.
— U.S. Central Command (@CENTCOM) July 30, 2026