
ఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు శుక్రవారం తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిట్టు రాజీనామాను ఆమోదించారు. పంజాబ్కు చెందిన బీజేపీ నాయకుడైన రవ్ నీత్ సింగ్ బిట్టు 2024 నుంచి కేంద్ర మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు.
President Droupadi Murmu, as advised by the Prime Minister, has accepted the resignation of Ravneet Singh from the Union Council of Ministers, with immediate effect
(File pic of Ravneet Singh) pic.twitter.com/YuqroBzOi9
— ANI (@ANI) July 24, 2026
2027లో పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించే ఉద్దేశంతోనే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి బిట్టు తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది.
అయితే.. ఈ బీజేపీ నాయకుడి రాజ్యసభ పదవీ కాలం జూన్లోనే ముగిసింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బీంత్ సింగ్ మనవడే ఈ బిట్టు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
అయితే.. కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఖాళీ చేసిన స్థానంలో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2024 నుంచి కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగుతూ వచ్చారు.