
నీట్ ( NEET ) ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై విధ్యార్థుల చేస్తున్న ఆంధోళనను ఉద్దేశించి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక సందేశం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు , భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పేపర్ లీక్ నిందితులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందనే నమ్మకం తనకు ఉందన్నారు. అందుకే విద్యార్థులు తమ ఆందోళనలను విరమించి తమ ఇళ్లకు, తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని కోరారు.
ఇంటికి వెళ్లండి..
సోషల్ మీడియా వేదికగా స్పందించిన సల్మాన్.. విద్యార్థుల విద్య, భద్రత ప్రభుత్వానికి అత్యు్న్నత ప్రాధాన్యత. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటికే పేపర్ లీక్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ఆందోళన చెందకుండా ఇంటి వెళ్లాలని సల్మాన్ కోరారు.
మా ఇంటి నుంచి భోజనం పంపిస్తా..
అంతేకాదు, నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విద్యా సంస్కరణల కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ను ఉద్దేశించి కూడా సల్మాన్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ‘సోనం బ్రో… మీ పోరాటం ఫలించింది. ఇక దీక్ష కొనసాగించకండి. అవసరమైతే మరో రోజు కోసం ఆ శక్తిని దాచుకోండి. కావాలంటే మా ఇంటి నుంచి భోజనం పంపిస్తాను’ అని కోరారు . ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు..
ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పేపర్ లీక్ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తూ ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దోషులకు వేగంగా, కఠిన శిక్షలు విధిస్తామని ప్రకటించారు. యువత భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం అని ఆయన స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో మోదీ ట్విట్ చేశారు.
ALSO READ : ప్రాణం పెట్టి నటించా.. విజయ్‌తో సీన్స్ కట్ చేయడం బాధగా ఉంది..
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this…
— Narendra Modi (@narendramodi) July 23, 2026
విద్యార్థులకు బాలీవుడ్ మద్దతు..
నీట్ ( NEET ) పేపర్ లీక్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి ప్రధాన డిమాండ్స్ తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 20 నుంచి విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమానికి నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ, ప్రకాశ్ రాజ్, రాజ్‌కుమార్ రావు, అనురాగ్ కశ్యప్, టోవినో థామస్, అరిజిత్ సింగ్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ విద్యార్థులకు అండగా నిలిచారు. ఈనేపథ్యంలో సల్మాన్ ఖాన్ వరుసగా రెండోసారి స్పందించడంతో ఈ అంశం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.