Reading Time: < 1 minute
Mega 158 Nara Rohit Locked For A Key Role In Chiranjeevi Bobby Film

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్  డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మెగా 158 భారీ చిత్రం ఇటీవల గ్రాండ్ గా పూజా కార్యక్రమాలను కూడా ముగించుకుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసుకుంటోంది. తంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరి కలయికలో వస్తున్న ‘Mega158’ పై అంచనాలు అప్పుడే స్కై హై లో ఉన్నాయి.

కాగా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరో  నారా హీరో నారా రోహిత్ పేరు పరిలిస్తున్నట్టు సమాచారం. సినిమాలో సెకండాఫ్ లో వచ్చే ఇంపార్టెంట్ రోల్ కోసం పలువురు హీరోల పేర్లు పరిశీలించి నారా రోహిత్ ను లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బాబీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఈ విలక్షణమైన కాంబినేషన్ వెండితెరపై సరికొత్త హంగామా సృష్టించడం ఖాయం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కన్నడ బడా నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా సీనియర్ నటి ప్రియమణి, మలయాళ యంగ్ బ్యూటీ అనశ్వర రాజన్ ఈ సినిమాలో చిరు కూతురుగా నటిస్తోంది.