Reading Time: < 1 minute

విజయ్కు ఊహించని ఎదురుదెబ్బ.. ప్రమాణ స్వీకారం లేనట్టే.. కారణం ఏంటంటే..

Caption of Image.

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలకు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడుతుందని.. గవర్నర్ కూడా విజయ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంతా భావించారు.

విజయ్ మే 9న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ.. ఊహించని విధంగా గవర్నర్ కార్యాలయం ట్విస్ట్ ఇచ్చింది. టీవీకేకు ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని.. వీసీకే, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేల మద్దతు లేఖలు తమకు విజయ్ ఇవ్వలేదని లోక్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉండగా.. టీవీకేకు తాము మద్దతు తెలపడం లేదని IUML పార్టీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. ఈ కారణాల వల్ల.. విజయ్ ముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు లేకుండా పోయాయి. విజయ్‌ను రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించలేదని గవర్నర్ ఆర్.వి. అర్లేకర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

టీవీకేకు మద్దతుగా నిలవాలని వీసీకే, ఏఎంఎంకే, ఒక ఐయూఎంఎల్ ఎమ్మెల్యేను ఒప్పించేందుకు తీవ్రంగా చర్చలు జరిగాయి. అయితే.. విజయ్ అవసరమైన మద్దతును కూడగట్టలేకపోయారు. 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే విజయ్ కూడగట్టగలిగారు. ఇది మెజారిటీ సంఖ్యకు రెండు తక్కువగా ఉందని గవర్నర్ కార్యాలయం గుర్తుచేసింది.

వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు కూడగట్టలేకపోవడంతో తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఐయూఎంఎల్, ఏఎంఎంకే పార్టీలు టీవీకే నేతృత్వంలోని కూటమిలో భాగం కావడానికి నిరాకరించడంతో విజయ్కు సీఎం సీటు ప్రస్తుతానికైతే అందని ద్రాక్షలానే మిగిలిపోయింది.

©️ VIL Media Pvt Ltd.