July 12, 2026

కుక్కల వయసు పెరిగిందని… హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి నందిగామ శివారులో వదిలేస్తే…

కుక్కల వయసు పెరిగిందని... హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి నందిగామ శివారులో వదిలేస్తే...
Reading Time: < 1 minute

కుక్కల వయసు పెరిగిందని… హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి నందిగామ శివారులో వదిలేస్తే…

Caption of Image.

కుక్కల వయసు పెరిగిందని హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి సంగారెడ్డి జిల్లా నందిగామ శివారులో 11 సైబీరియన్ హస్కీ, 1 జర్మన్ షెపర్డ్ కుక్కలను వదిలిపెట్టారు నలుగురు వ్యక్తులు. ఈ క్రమంలో ఎండ తట్టుకోలేక ఒక హస్కీ కుక్క మృతి చెందగా.. మిగిలిన కుక్కలకు ప్రాణాలకు ముప్పు వాటిల్లినట్లు తెలుస్తోంది. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బీడీఎల్ భానూర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని మియాపూర్ దగ్గర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. 

స్థలం సరిపోక, కుక్కల వయసు పెరగడంతో వదిలేసినట్లు పోలీసుల విచారణలో తెలిపారు నిందితులు. రక్షించిన 11 హస్కీ కుక్కలను స్వాన్ NGOకు అప్పగించినట్లు తెలిపారు పోలీసులు.

©️ VIL Media Pvt Ltd.