July 12, 2026

దండేపల్లి మండలంలో అన్నదాత అతలాకుతలం 

దండేపల్లి మండలంలో అన్నదాత అతలాకుతలం 
Reading Time: < 1 minute

దండేపల్లి మండలంలో అన్నదాత అతలాకుతలం 

Caption of Image.

దండేపల్లి, వెలుగు :  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యం తడిసిముద్దైంది. రోడ్లపై  భారీ వృక్షాలు విరిగి పడడంతో అర్ధరాత్రి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు హుటాహుటిన జేసీబీల సహాయంతో చెట్లను తొలగించి ట్రాఫిక్‌‌‌‌ను క్లియర్ చేశారు. దాదాపు 80 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు కూడా దెబ్బతిన్నాయి. బుధవారం ఉదయం నుంచి ఏడీఈ ప్రభాకర్‌‌‌‌రావు ఆధ్వర్యంలో విద్యుత్ పునరుద్ధరణ కోసం సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. ఇదిలా ఉండగా, ధాన్యం కుప్పలు తడవకుండా రైతులు రాత్రి వేళల్లో వర్షంలోనే కుప్పలపై కవర్లు కప్పి రక్షించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నర్సాపూర్, దండేపల్లి గ్రామాల్లో వర్షం దాటికి రెండు నివాస గృహాల గోడలు కూలిపోయాయి

©️ VIL Media Pvt Ltd.