Reading Time: < 1 minute

శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ మార్కెట్ క్యాప్ రూ.95 లక్షల కోట్లు..ట్రిలియన్ డాలర్లను దాటిన రెండో ఆసియా కంపెనీ

Caption of Image.

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌ (ఏఐ) చిప్స్‌‌ను తయారు చేస్తున్న శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ క్యాప్‌‌‌‌ బుధవారం ఒక ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.95 లక్షల కోట్ల) మార్కును తాకింది. గత ఏడాది కాలంలో ఈ కంపెనీ షేర్ల విలువ నాలుగు రెట్లు పెరిగింది.    తైవాన్‌‌‌‌కు చెందిన మరో చిప్‌‌‌‌ల తయారీ కంపెనీ టీఎస్‌‌‌‌ఎంసీ తర్వాత, ఒక ట్రిలియన్ డాలర్ల క్లబ్‌‌‌‌లో చేరిన రెండో ఆసియా కంపెనీగా శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ నిలిచింది. 

బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలో కంపెనీ షేర్లు 11శాతం మేర పెరిగాయి.  శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ దూకుడుతో దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ సూచీ కోస్పి  మొదటిసారిగా 7 వేల మార్కును దాటింది.   ” ట్రిలియన్ డాలర్ల మైలురాయి కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. ఏఐ మౌలిక సదుపాయాలలో మెమరీ చిప్స్ పాత్ర ఎంత కీలకమో ఇది తెలియజేస్తోంది” అని రౌండ్‌‌‌‌హిల్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్ సీఈఓ డేవ్ మజ్జా పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.