
తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వడ్ల కొనుగోలుపై బుధవారం ( మే 6 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్. ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ విషప్రచారం చేస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8వేల 575 సెంటర్లలో ధాన్యం కొనుగోలు జరుగుతోందని.. 2.63 లక్షల టార్పోలిన్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.
64 లక్షల మెట్రిక్ టన్నుల మిల్లింగ్ కెపాసిటీ అందుబాటులో ఉందని… తడిసిన ధాన్యాన్ని ఏం చేయాలి అనేది కూడా అధికారులకు సూచనలు చేశామని అన్నారు మంత్రి ఉత్తమ్. ప్రతి కొనుగోలు సెంటర్లలో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి సివిల్ సప్లై భవన్ లో కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని అన్నారు.
►ALSO READ | సీఎం కాన్వాయ్ కోసం ప్రజల పనులకు అడ్డుకోవద్దు…గంటల తరబడి వాహనాలు నిలిపివేయొద్దు: డీజీపీ సీవీ ఆనంద్
ప్రతి రోజు వెదర్ అలర్ట్ అన్ని కొనుగోలు సెంటర్లకు అందిస్తున్నామని..తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఎక్కువ కొనుగోలు సెంటర్ల ను ఏర్పాటు చేశామని… బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కంటే కాంగ్రెస్ హయంలో ఎక్కువ మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ఖరీఫ్ సీజన్ లో 72 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని అన్నారు మంత్రి ఉత్తమ్.
ఏ రైతుకు ఇబ్బంది వచ్చిన కంట్రోల్ సెంటర్ కు పిర్యాదు చేయొచ్చని అన్నారు. కేటీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో అవగాహన రహితంగా మాట్లాడుతున్నారని.. బీఆర్ఎస్ కు ఇప్పటికే ప్రజలు బొంద పెట్టారని అన్నారు మంత్రి ఉత్తమ్.