Reading Time: 2 minutes

బ్రేక్ అప్ చెబితే ఇంత పగా? ప్రేయసి ఇంటికి 18 మంది పురుషులను పంపిన మాజీ ప్రియుడు

Caption of Image.

కొందరు ఆన్ లైన్లో సెలెబ్రిటీల పేర్లతో మోసం చేస్తుంటారు….మరికొందరు ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లు నటిస్తూ డబ్బులు  దోచుకుంటుంటారు.. ఇంకొందరైతే ఏకంగా నకిలీ ఫేక్ ప్రొఫైల్స్ తో అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటారు… కానీ ఇక్కడ జరిగింది అంత లేటెస్ట్ టెక్నాలజీతో.. చివరికి టెక్నాలజీని ఈ విధంగా వాడుకొని ఇలా కూడా మోసాలు చేస్తారా అని అనుకునేలా చేసాడు ఓ మోసగాడు..
  
వివరాలోకి వెళితే.. అసద్ హుస్సేన్ అనే 36 ఏళ్ల వ్యక్తి, తన మాజీ గర్ల్ ఫ్రెండ్ పై పగ తీర్చుకోవడానికి అత్యంత ఘోరమైన ప్లాన్ చేసాడు. ఆమె పేరుతో టిండర్ అనే డేటింగ్ యాప్‌లో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, ఆమె ఉండే ఇంటికి ఇతరులు వెళ్లేలా రెచ్చకొట్టాడు. 

దీనికంటే ముందే టిండర్ యాప్ లో నకిలీ ప్రొఫైల్ ద్వారా కొందరు పురుషులతో మాట్లాడుతూ.. తనకు అత్యాచార ఫాంటసీలు ఉన్నాయని అబద్ధం చెబుతూ చాట్ చేసాడు. ఒకవేళ ఆమె వద్దు అని అరిచినా, అది ఆమెకు ఇంకా కావాలని అర్థమని, బలవంతం చేయమని వారిని మరింతల రెచ్చగొట్టాడు.

 ఈ మాటలు నమ్మి సుమారు 18 మంది పురుషులు ఆమె ఇంటికి వెళ్లారు. ఒకే రోజు రాత్రి ఓ నలుగురు వ్యక్తులు ఆమె తలుపు కొట్టారు. ఒక వ్యక్తి అయితే తలుపు అద్దం పగులగొట్టి లోపలికి రావడానికి ప్రయత్నించాడు. ఒకసారైతే  ఆమె కూతురు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి లోపలికి వచ్చి కొద్దిసేపు ఉన్నాడు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

 విషయం ఏంటంటే 
అసద్ హుస్సేన్ అనే వ్యక్తి తన అసలు పేరు దాచి, సోషల్ మీడియాలో ‘మిక్ రెన్నీ’ అనే దొంగ పేరుతో 2024 ఏప్రిల్‌లో ఒక మహిళకు పరిచయమయ్యాడు. వీరిద్దరూ కొన్నిసార్లు బయట కలుసుకున్నారు, ఆ తర్వాత అది ప్రేమగా మారింది.

►ALSO READ | అమెరికా ఫ్యూయెల్ ప్లేన్ గల్లంతు..పర్షియన్ గల్ఫ్ లో ఘటన

కానీ, కొన్నాళ్లకే హుస్సేన్ ఆమెను తన అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నించాడు. ఒకరోజు ఆమె ఇంటికి ఒక మగ స్నేహితుడు వచ్చాడని తెలిసి, హుస్సేన్ అక్కడికి వెళ్లి రెండు గంటల పాటు డోర్ బెల్ కొడుతూనే ఉన్నాడు. చివరికి చుట్టుపక్కల వారు పోలీసులకు ఫోన్ చేయడంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు.

మే 6, 2024న జరిగిన గొడవ:
ఆ రోజు హుస్సేన్ ఆమె ఫోన్ తీసుకుని, ఆమె సహోద్యోగులు, స్నేహితులకు వచ్చిన మెసేజ్‌లన్నీ చదువుతూ ఆమెను అనుమానించాడు. ఆమె వేరే ఎవరితోనైనా తిరుగుతుందేమోనని నిలదీశాడు. ఆ తర్వాత ఆమె వాష్‌రూమ్‌కు వెళ్తుంటే, నేను ఇక్కడ లేనప్పుడు నువ్వు ఫోన్ దగ్గర పెట్టుకోకూడదు అని అడ్డుకున్నాడు. ఆమె వినకుండా వెళ్లబోతే, ఆమెను గట్టిగా వెనక్కి నెట్టేశాడు. ఆమె కింద పడిపోగానే, ఆమె చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కున్నాడు. ఆ రోజు తర్వాత ఆమెకు ‘మిక్ రెన్నీ’ మళ్లీ కనిపించలేదు. అప్పటివరకు ఆమెకు అతని అసలు పేరు అసద్ హుస్సేన్ అని తెలియనే తెలియదు.

పగతో నకిలీ ప్రొఫైల్ సృష్టించాడు:
ఆమె తనతో మాట్లాడటం మానేసినా, హుస్సేన్ ఆమె కూతురికి, స్నేహితులకు ఫోన్ చేసి ఆమె క్యారెక్టర్ గురించి తప్పుగా చెప్పాడు. ఆమెను మళ్ళీ కలవమని వేధించాడు, కానీ ఆమె ఒప్పుకోలేదు. దీంతో విపరీతమైన కోపంతో ఊగిపోయిన అతను, ఆమె పేరు మీద టిండర్ (Tinder) యాప్‌లో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించాడు. ఆ ప్రొఫైల్స్ ద్వారా ఇతర పురుషులకు ఆమె ఇంటి అడ్రస్ ఇచ్చి, ఆమెపై అత్యాచారం చేయమని ప్రోత్సహించాడు. చివరికి అతను పోలీసులకు దొరక్కుండా ఉండటానికి తన కారు నంబర్ ప్లేట్ మార్చడం, ఫోన్లను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వంటివి చేశాడు.

పోలీసులు ఎలా పట్టుకున్నారు?
మొదట్లో ‘మిక్ రెన్నీ’ ఎవరో పోలీసులకు తెలియలేదు. కానీ బాధితురాలి ఇంటి వద్ద ఉన్న డోర్ బెల్ కెమెరా ఫుటేజీని పరిశీలించగా, అక్కడ కనిపించిన ఒక ఖరీదైన ఆడి కారు అసద్ హుస్సేన్ పేరు మీద రిజిస్టర్ అయి ఉందని తెలిసింది. దీనితో అసలు నిందితుడు అతనే అని తేలిపోయింది.

ప్రస్తుత పరిస్థితి
అక్టోబర్ 2024లో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో విచారణ సందర్భంగా అతను అన్నీ అబద్ధాలే చెప్పాడు. తనకు ఆ మహిళ ఎవరో తెలియదని, ఆ కారు తనది కాదని వాదించాడు. కానీ ఫోన్ రికార్డులు, సీసీటీవీ ఆధారాలతో అతను దోషి అని తేలింది.

సెప్టెంబర్ 2025లో అతనిపై  వేధింపులు, దాడి చేయడం, పోలీసులకు సహకరించకపోవడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఈ కేసును అత్యంత కలవరపరిచే కేసుగా పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఒక మహిళ జీవితాన్ని ఎంతలా నాశనం చేయవచ్చో ఈ ఘటన నిరూపిస్తోంది. బాధితురాలు, ఆమె పిల్లలు ధైర్యంగా నిలబడి సాక్ష్యం చెప్పడంతో నిందితుడికి శిక్ష పడేలా చేశారు.

©️ VIL Media Pvt Ltd.