
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 108 స్థానాల్లో గెలుపొంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది టీవీకే. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ గవర్నర్ అర్లేకర్ ను కలిశారు విజయ్. టీవీకే నేతలతో కలిసి బుధవారం ( మే 6 ) లోక్ భవన్ లో గవర్నర్ ను కలిశారు విజయ్.
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో 108 సీట్లు గెలుచుకుని, మెజారిటీ మార్కుకు కొద్దిగా దూరంలో నిలిచింది టీవీకే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 సీట్లు మెజారిటీ అవసరం.కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే టీవీకేకి తమ మద్దతును ప్రకటించింది. టీవీకే పార్టీకి సొంతంగా 108 సీట్లు ఉన్నాయి. మిగతా 10 సీట్లను ఇతర పార్టీల నుంచి మద్దతు తీసుకుంటున్నారు విజయ్.
TVK chief Vijay meets Governor Rajendra Arlekar, stakes claim to form govt in Tamil Nadu
Read @ANI Story | https://t.co/qQEBokhiuX#TVK #Vijay #TamilNadu #TNGovernor #RajendraArlekar pic.twitter.com/644Xjggioo
— ANI Digital (@ani_digital) May 6, 2026
అందులో భాగంగా ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. మద్దతు విషయంపై రాహుల్ గాంధీ, విజయ్ ఫోన్ లో స్వయంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తమిళనాడు కాంగ్రెస్ శాఖ సైతం విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలనే డిమాండ్ వినిపించింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సీఎంగా ప్రమాణ స్వీకార ముహూర్తం ఇదే :
2026, మే 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 15 నిమిషాల మధ్య ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు అయ్యింది. చెన్నై సిటీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. ఈ స్టేడియంలో 5 వేల మంది మాత్రమే కూర్చునే సీట్లు ఉన్నాయి. అంత మందికి మాత్రమే పాసుల జారీ ఉండనుందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
►ALSO READ | విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీకి ఆహ్వానం..!
మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం జరగబోతుండటంతో.. స్టేడియం పరిసరాల్లో బందోబస్తు పటిష్ఠం చేశారు అధికారులు. విజయ్ కు సినిమా ఫ్యాన్స్ ఎక్కువ. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండటంతో.. భద్రతను ముందుగానే పర్యవేక్షిస్తున్నారు పోలీస్ అధికారులు.
రెండు, మూడు దశల్లో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పాస్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ అని స్పష్టం చేశారు. మిగతా వాళ్లు అంతా టీవీల్లోనే చూడాలని.. స్టేడియం దగ్గర రావొద్దని స్పష్టం చేస్తున్నారు అధికారులు.