July 15, 2026

Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..

Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
Reading Time: < 1 minute
Jubilee Hills Minor Trap Case Shocking Twists Emerge In Instagram Exploitation Racket

హైదరాబాద్‌లో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ధనిక కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేసి, వారిని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీస్ లకు దొరక్కుండా లీగల్ గా చాలా పగడ్బందీగా వ్యవహరించాడు అర్జున్ . తన స్నేహితులు హర్ష, జతిన్, శ్రీజిత్ ల సెల్ ఫోన్ ల నుండి అమ్మాయిలను ట్రాప్ చేశారు అర్జున్ , రాజీవ్. పోలీస్ కు దొరికినా తన మీదకు రాకుండా ఫ్రెండ్స్ instagram ను వాడుకున్నాడు అర్జున్.

మైనర్లు ట్రాప్ అయ్యాక, వారి తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో అర్జున్ వెళ్ళి మైనర్ల తో లైంగికంగా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అలా 25 మంది మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసిన అన్నదమ్ములు అర్జున్ అండ్ రాజీవ్. ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా మైనర్ అమ్మాయిల నుండి వసూలు చేసినట్టు పోలీస్ దర్యాప్తు లో వెల్లడైనట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు అర్జున్‌పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు.

కేసులో అరెస్టైన నిందితులు

A1 – అర్జున్ (ప్రధాన నిందితుడు)
A2 – సరస్వతి (బాధితురాలి వాచ్‌మన్‌గా పనిచేసిన వ్యక్తి)
A3 – రాజీవ్ (అర్జున్ సోదరుడు)
A4 – మీనాకుమారి (నిందితుల తల్లి)
A5 – ప్రశాంత్ (అర్జున్ మేనమామ)

మరోసారి కస్టడీకి పోలీసుల విజ్ఞప్తి

ఇప్పటికే అర్జున్, మరో నిందితుడి ప్రవీణ్ ను నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు, కీలక ఆధారాలు సేకరించారు. విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడటంతో, మరోసారి నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.