
హైదరాబాద్, వెలుగు: విధుల్లో ఉన్న ట్రాఫిక్ టికెట్ ఇన్‌స్పెక్టర్ (టీటీఐ)పై దాడి చేసిన కండక్టర్‌పై ఆర్టీసీ కఠిన చర్యలు తీసుకుంది. ఈ దాడిని క్రమశిక్షణారహితంగా పరిగణించి నారాయణఖేడ్ డిపోకు చెందిన కండక్టర్ దేవ్‌సోత్ వసంత్‌ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ బస్ భవన్ నుంచి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 1న హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి నారాయణఖేడ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును టీటీఐ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో టికెట్ల తనిఖీ విషయమై కండక్టర్ వసంత్ అధికారులతో వాగ్వాదానికి దిగి వారిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, దురుసుగా ప్రవర్తించడాన్ని యాజమాన్యం సీరియస్‌గా పరిగణించింది. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. దీనిలో కండక్టర్ తప్పు చేసినట్టు నిర్ధారణ కావడంతో నారాయణఖేడ్ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం సోమవారం వసంత్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.