Reading Time: < 1 minute
Jr Ntrs Dragon Transformation Lean Look For Part 1 Bulk Body For Part 2 Revealed

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’. ఈ సినిమాపై అటు నందమూరి అభిమానులతో పాటు, ఇటు సామాన్య ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కానుండగా.. ఎన్టీఆర్ ఫిజిక్ పట్ల వస్తున్న అప్‌డేట్స్ మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ తన సిక్స్ ప్యాక్ బాడీ, కండలు తిరిగిన దేహంతో కనిపించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ కొత్త లుక్ చూసి అభిమానులు ఫిదా అయ్యారు.

డ్రాగన్ కోసం తారక్ చాలా వరకు వెయిట్ లాస్ అయ్యాడు. టైగర్ లీన్‌ లుక్‌తో ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్ పీక్స్‌లో ఉంటుందనే హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రాన్స్‌ఫర్మేషన్ మామూలుగా ఉండదని తెలుస్తోంది. ఇప్పటి వరకు సన్నగా కనిపించిన తారక్.. మరో ఊహించని మేకోవర్‌లో కనిపించనున్నాడట. ఈసారి బరువు పెరిగి బల్క్ బాడీతో ఫిట్‌గా కనిపించనున్నాడట. అయితే ఈ లుక్ పార్ట్ 2 కోసం అని తెలుస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ ఉండగా.. పార్ట్‌ 1తో పాటు సెకండ్ పార్ట్ షూటింగ్‌ కంప్లీట్ చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. కథా పరంగా చూస్తే.. రెండో భాగంలో హీరో పాత్ర మరింత శక్తివంతంగా భారీగా కనిపించాల్సి ఉందట. అందుకే.. ఎన్టీఆర్ తన బాడీని భారీగా బల్క్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా టాక్. ఈ లుక్‌ రెండో భాగానికి లీడ్ ఇచ్చేలా ఉంటుందనే చెప్పాలి. ఏదేమైనా.. ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.