Reading Time: < 1 minute

బతుకమ్మ కుంట నాదే..? గతంలో అక్కడ పంటలు పండించాం..!

Caption of Image.
  • మా వ్యవసాయ భూమి అది
  • గుంతలు ఉండి నీళ్లు చేరితే బతుకమ్మలు తెచ్చి వేసేటోళ్లు
  • అంతమాత్రాన బతుకమ్మ కుంట అయితదా? 
  • బీఆర్ఎస్​నేత ఎడ్ల సుధాకర్

అంబర్ పేట్, వెలుగు: ‘బతుకమ్మ కుంట అని ఇప్పుడు పిలుస్తున్న జాగ నాదే. 1986 నుంచి రికార్డులు ఉన్నయ్​నా దగ్గర మొత్తం ఏడెకరాలైతే అందులో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉండె.. అక్కడక్కడ గుంతలు ఉండె…చుట్టుపక్కల ఉన్నోళ్లంతా బతుకమ్మలు ఆడి తెచ్చి ఆ గుంతల్లో నీళ్లు చేరితే వేసేటోళ్లు.. అంతమాత్రాన బతుకమ్మ కుంట అయిపోతదా? ప్రతి ఊరిలో ఒక చెరువు ఉంటది. దానికి ఒక పేరు ఉంటది. అసలు బతుకమ్మ కుంట అని పేరే లేదు’ అని అంబర్​పేట బీఆర్ఎస్ లీడర్​ఎడ్ల సుధాకర్​రెడ్డి అన్నారు. తన దగ్గర రికార్డులు ఉన్నాయి కాబట్టే కోర్టును ఆశ్రయించానని చెప్పారు. బుధవారం ఆయన  అంబర్​పేటలోని తన ఆఫీసులో మాట్లాడారు. 

తన దగ్గర రికార్డులు పక్కాగా ఉన్నాయి కాబట్టే హైకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. స్టేటస్​కో ఆర్డర్​ఉన్నా అభివృద్ధి కోసం సర్కారు రూ. 8 కోట్లు ఎట్లా మంజూరు చేస్తుందని ప్రశ్నించారు. ఆ డబ్బులను హైడ్రా చీఫ్ నుంచి రికవరీ చేయాలన్నారు. బతుకమ్మ కుంట పనులు చేస్తున్నప్పుడు కూడా తనను హౌస్​అరెస్ట్​చేశారన్నారు. దీని వెనక కాంగ్రెస్​నేత వీహెచ్​ఉన్నారని ఆరోపించారు. తోడుగా అఖిలపక్షం ధర్నా చేయడం చూస్తే నవ్వొస్తుందన్నారు. ఇప్పటికే అక్కడ నేమ్ ప్లేట్స్ తొలగించారని, త్వరలోనే బతుకమ్మ కుంట తనకు వస్తుందన్న నమ్మకం ఉందన్నారు.  
 

©️ VIL Media Pvt Ltd.