July 17, 2026

Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..

Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
Reading Time: < 1 minute
Shruti Haasan Varahi Devi Temple Visit Life Changes Peddi Movie Update

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన బోల్డ్ స్టేట్‌మెంట్స్, విభిన్నమైన లైఫ్ స్టైల్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. అయితే తాజాగా ఆమెలోని మరో కోణం బయటపడింది. తాను నాస్తికురాలిని కాదని, దైవ విశ్వాసం మెండుగా ఉన్న వ్యక్తినని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల వారాహీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తన జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయని ఆమె ఎమోషనల్ అయ్యారు.

చెన్నై మయిలాపూర్‌లోని ఒక చిన్న వారాహీ ఆలయానికి వెళ్లినప్పుడు తనకు కలిగిన అనుభూతిని శృతి వివరించారు.. ‘దైవాలు కూడా మనల్ని ఎంచుకుంటారు. గర్భగుడిలోకి వెళ్లగానే ఒక తెలియని శక్తిని, భక్తి పారవశ్యాన్ని పొందాను. అక్కడ ఎలాంటి వీఐపీ క్యూలు లేవు, ఆడంబరాలు లేవు. కేవలం శక్తివంతమైన దేవత మాత్రమే ఉన్నారు’ అని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఆమె అస్సాంలోని ప్రసిద్ధ శక్తిపీఠం కామాఖ్య దేవాలయాన్ని కూడా సందర్శించారు.

ఇక వ్యక్తిగత ప్రేమ వ్యవహారం అచ్చిరాకపోవడంతో ప్రస్తుతం తాను సింగిల్ అని ప్రకటించిన శృతి, ఇప్పుడు పూర్తి ఫోకస్ కెరీర్ ఆధ్యాత్మికతపైనే పెట్టారు. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి సరసన ‘ట్రైన్’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్ సరసన ‘సలార్: పార్ట్ 2’ కోసం సిద్ధమవుతున్నారు. దీంతో నాటుగా తాజా సమాచారం ప్రకారం, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో శృతి హాసన్ ఒక పవర్‌ఫుల్ స్పెషల్ రోల్‌లో కనిపించబోతున్నారట.