Reading Time: < 1 minute
Spirit A Mind Blowing Update

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో.. ప్రభాస్‌ను ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించబోతున్నాడు సందీప్. దీంతో స్పిరిట్ పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి, ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది. 2027 మార్చి 5న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా.. ప్రభాస్ డేట్స్ కాస్త అడ్జెస్ట్ అవడం లేదనే టాక్ అయితే వినిపిస్తోంది. దీంతో.. స్పిరిట్ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. కానీ, లేటెస్ట్‌గా తెలిసిన విషయం ఏంటంటే.. సందీప్ ఈ సినిమాను పక్కా ప్లానింగ్‌తో షూట్ చేస్తున్నాడు. వచ్చే సెప్టెంబర్ నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని డెడ్‌లైన్ పెట్టుకున్నాడట. ఆ తర్వాత పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్‌ పై ఫోకస్ చేసి.. ఏది ఏమైనా ప్రకటించిన డేట్‌కే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడట. మామూలుగా అయితే, ప్రభాస్ సినిమాలు ఈ మధ్య కాస్త డిలే అవుతు వస్తున్నాయి. కానీ ‘స్పిరిట్’ విషయంలో మాత్రం ముందే పక్కాగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి, శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసేలా దూసుకుపోతున్నాడు సందీప్. ఇక సందీప్ గత చిత్రాలైన ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’లో ఉండే ఎమోషన్స్ మరియు వైలెన్స్‌తో పాటు.. ‘స్పిరిట్’ కంటెంట్ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్. మేకింగ్ స్టైల్ నుండి టెక్నికల్ వాల్యూస్ వరకు ఈ సినిమా ఒక కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయనుందని సమాచారం.