July 17, 2026

KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
Reading Time: < 1 minute
Official Tabu Joins Nagarjunas Landmark 100th Film King100 Shoot Begins

గతేడాది ‘కూలీ’, ‘కుబేర’ లాంటి చిత్రాలతో అలరించిన కింగ్ నాగర్జున కొత్త సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు రా.కార్తీక్‌ దర్శకత్వంలో 100వ చిత్రంలో నటిస్తున్నారు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని కులుమనాలీ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఎమాషనల్ యాక్షన్ డ్రామాలో నాగ్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు.

సీనియర్ నటి టబు ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోస్తిస్తుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. తాజాగా నటి టబు తన ఇన్ స్టా అకౌంట్ లో నాగార్జున 100లో నటిస్తున్నట్టు పోస్ట్ చేసింది. అటు మేకర్స్ కూడా టబు ఆన్ బోర్డ్ అయినట్టు అఫీషియల్ గా ప్రకటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగార్జున – టబు కలిసి నటించబోతున్నారు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అలాగే ఈ సినిమలో నాగ్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.  తాజా సమాచారం ప్రకారం మే నెల నాటికి నాగార్జునకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ మొత్తం పూర్తి చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై ఫోకస్ చేయనుంది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి ‘లాటరీ కింగ్’, ‘కింగ్‌ 100’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అయితే, ఈ చిత్రంలో నాగ్ డి-ఏజింగ్ టెక్నాలజీ ద్వారా 25 ఏళ్ల యువకుడిగా కనిపించబోతుండడం.. సినిమా పై అంచనాలను పెంచేస్తోంది. టబు – నాగ్ జోడి వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో 100వ సినిమాతో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.