
చెన్నై: తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో.. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేశారు. సంక్షేమ పథకాలతో ఈ మేనిఫెస్టోను అన్నాడీఎంకే నింపేసింది. మేనిఫెస్టోలో 297 ఎన్నికల హామీలను అన్నాడీఎంకే పొందుపరిచింది.
#WATCH | Chennai, Tamil Nadu: AIADMK General Secretary Edappadi K. Palaniswami releases the party’s manifesto for the Tamil Nadu Assembly elections
A total of 297 election promises have been announced. Ration card holders will receive lentils along with rice. The AIADMK stated… pic.twitter.com/V1LDyOdEHH
— ANI (@ANI) March 24, 2026
అన్నాడీఎంకే ప్రకటించిన మేనిఫెస్టోను తూచాతప్పకుండా అమలు చేయాలంటే సంవత్సరానికి రూ.38 వేల 314 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తమిళనాడులో రైస్ రేషన్ కార్డు ఉన్న 2 కోట్ల 22 లక్షల మందికి ఫ్రీ రిఫ్రిజిరేటర్.. అదేనండీ ఫ్రిడ్జ్తో పాటు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో అన్నాడీఎంకే ప్రకటించింది. ఎడ్యుకేషన్ లోన్స్ మాఫీ చేస్తామని ప్రకటించింది.
►ALSO READ | ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్.. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారంటే..?
ప్రతీ కుటుంబానికి పది వేల ఆర్థిక సాయం, రేషన్లో కిలో కందిపప్పు, ఒక లీటర్ వంట నూనె.. కుళ విళక్కు పథకంలో భాగంగా అర్హురాలైన మహిళలకు ప్రతీ నెల రూ.2 వేల ఆర్థిక సాయం.. సీనియర్ సిటిజన్లకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు నెలకు రూ.2 వేల పెన్షన్.. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న గ్రాడ్యుయేట్లకు రూ.2 వేల నిరుద్యోగ భృతి, ప్లస్ 2 చదువుకుని నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న వారికి వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి, సంక్రాంతి క్యాష్ గిఫ్ట్ పేరిట వెయ్యి రూపాయల డబ్బులు, టూ-వీలర్ కొనాలనుకునే మహిళలకు రూ.25 వేల సబ్సిడీ.. ఫ్రీ చీరలు, దోతీలు.. తమిళనాడులో స్థానికులకు ప్రైవేట్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్.. ఇలా మొత్తం 297 ఎన్నికల హామీలతో అన్నాడీఎంకే తమిళనాడు ఓటర్లపై హామీల వర్షం కాదు.. కుండపోతనే కురిపించింది.