Reading Time: 2 minutes

OTT Thriller Review: షాకింగ్ నిజాలతో బెంగాలీ థ్రిల్లర్ సిరీస్.. తెలుగులో కూడా స్ట్రీమింగ్!

Caption of Image.

OTTలో ఓ బెంగాలీ హిస్టారికల్ థ్రిల్లర్ సిరీస్ దుమ్మురేపుతోంది. అదే ‘జాజ్ సిటీ’ (Jazz City). గులాబ్ గ్యాంగ్ ఫేమ్ సౌమిక్ సేన్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మార్చి 19న Sony LIV ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్కి వచ్చింది.

ఇందులో అరిఫిన్ షువూ, సౌరసేని మైత్రా, శంతను ఘటక్, అనిరుద్ధ గుప్తా, శ్రేయ భట్టాచార్య, షతాఫ్ ఫిగర్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సిరీస్ బెంగాలీతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండటంతో ఆడియన్స్‌ను ఆకర్షిస్తోంది.

1971 బంగ్లాదేశ్ విభజన సమయంలో కోల్‌కతా జాజ్ క్లబ్ బ్యాక్‌డ్రాప్‌లో గూఢచారి వ్యవస్థ, విప్లవ రాజకీయాల చుట్టూ కథ నడుస్తుంది. ఇది కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా, ఒక దేశం ఆవిర్భావం వెనుక ఉన్న పోరాట గాథను భావోద్వేగంగా చూపిస్తుంది. ఇందులోని సన్నివేశాలు ఆడియన్స్‌ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి.

కథేంటంటే:

జిమ్మీ రాయ్ (అరిఫిన్ షువూ) 1971లో కలకత్తాలోని పార్క్ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌లో జాజ్ సిటీ అనే క్లబ్‌‌‌‌‌‌‌‌ని నడుపుతుంటాడు. అతను బంగ్లాదేశ్ నుంచి శరణార్థిగా వచ్చిన యువకుడు. పేదరికం, బాధలు మరచిపోయి వెస్టర్న్ స్టైల్ డ్రెస్ వేసుకుని, ఇంగ్లిష్ మాట్లాడుతూ తనను తాను కొత్తగా మార్చుకుంటాడు. రాజకీయాలను పట్టించుకోకుండా బిజినెస్ చేసుకుంటాడు. అతని మాజీ లవర్ షీలా బోస్ (సౌరసేని మైత్రా) ఒక పెద్ద బిజినెస్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ని పెళ్లి చేసుకుని, శరణార్థులకు సాయం చేసే సంఘంలో చేరుతుంది.

►ALSO READ | Ustaad Bhagat Singh Collection: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 3 డేస్ కల్లెక్షన్స్ ఇవే.. ‘హరి హర వీరమల్లు’తో పోలిస్తే చాలా తక్కువే!

అదే సమయంలో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌లో లిబరేషన్ మూవ్‌‌‌‌‌‌‌‌మెంట్ తీవ్రమవుతుంది. అక్కడ జరిగే హింస వల్ల వేలమంది శరణార్థులుగా కలకత్తాలోకి వస్తారు. ముగ్గురు బంగ్లాదేశీ స్టూడెంట్స్ (లిబరేషన్ ఫైటర్లు) పాక్ ఆర్మీ అధికారి హనీఫ్ (షతాఫ్ ఫిగర్) దగ్గరనుంచి తప్పించుకుని ఇండియాకి వస్తారు. వాళ్లకు జిమ్మీ సాయం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సిరీస్‌‌‌‌‌‌‌‌ చూస్తేనే తెలుస్తుంది. 

ఎలా ఉందంటే:

అరిఫిన్ షువూ, సౌరసేని మైత్రా తమ పాత్రల్లో మంచి ఇంటెన్సిటీ చూపించారు. Shataf Figar నెగటివ్ షేడ్స్‌లో ప్రభావవంతంగా కనిపించారు. 1971 కాలం వాతావరణాన్ని రియలిస్టిక్‌గా చూపించడం, ఎమోషనల్ కనెక్ట్ ఉన్న సన్నివేశాలు, గూఢచారి ఎలిమెంట్స్‌తో థ్రిల్లింగ్ నేరేషన్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. 

‘జాజ్ సిటీ’సిరీస్ ఒక సాధారణ క్రైమ్ థ్రిల్లర్ కాకుండా, చరిత్ర, భావోద్వేగం, రాజకీయాలను కలిపిన ఇంటెన్స్ డ్రామా. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో థ్రిల్లర్ కంటెంట్ ఇష్టపడేవారికి ఇది మంచి ఛాయిస్.

©️ VIL Media Pvt Ltd.