July 12, 2026

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. స్వామి దర్శనానికి 25 గంటల సమయం

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. స్వామి దర్శనానికి 25 గంటల సమయం
Reading Time: < 1 minute

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. స్వామి దర్శనానికి 25 గంటల సమయం

Caption of Image.

తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు.  భారీగా  భక్తులు రావడంతో తిరుమల కిటకిటలాడుతోంది. ఉగాది, రంజాన్ పండుగలతో వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు క్యూ కట్డారు.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట బాట గంగమ్మ గుడి వరకు సుమారు  4 కిమీ మేర క్యూ లైన్లలో భక్తులు బారులు తీరి ఉన్నారు. దీంతో ఉచిత సర్వదర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ SSD దర్శనానికి 9 గంటల సమయం…. 300/-  రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. 

మరో వైపు శనివారం  ( మార్చి 21) తిరుమల శ్రీవారిని  77 వేల 864 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 39 వేల 348 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.