Reading Time: < 1 minute
India Vs Ireland Shubman Gill Set To Lead T20s Bcci Plans Big Captaincy Shift

టీమిండియా క్రికెట్‌లో కీలక మార్పులకు నాంది పలుకుతున్నట్లు తెలుస్తోంది. భారత్-ఐర్లాండ్ మధ్య జూన్‌లో జరగనున్న రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు యువ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌ ద్వారా గిల్‌కు మరింత బాధ్యతలు అప్పగించే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గిల్ ఇప్పటికే రెండు వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. భారత సెలెక్టర్లు, కోచింగ్ స్టాఫ్ కలిసి శుభ్‌మన్ గిల్‌ను భవిష్యత్ కెప్టెన్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలు రచిస్తున్నారట. ఇప్పటికే రెండు ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న గిల్.. తన కెప్టెన్సీలో జట్టును అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. అతడి నాయకత్వంలో టీమిండియా మంచి ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నారట. ప్రస్తుత టీ20 సారథిగా సూర్యకుమార్ యాదవ్ ఉన్న విషయం తెలిసిందే.

Also Read: Varanasi Update: ఫాస్ట్ ట్రాక్‌లో ‘వారణాసి’ షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా?

రాబోయే టీ20 ప్రపంచ కప్‌లో పాటు 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం కీలకంగా మారింది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా యువ సారథిని తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తోందట. శుభ్‌మన్ గిల్‌కు పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం ద్వారా జట్టును భవిష్యత్తుకు సిద్ధం చేయాలని ప్రయత్నిస్తోంది. మొత్తానికి ఐర్లాండ్ సిరీస్ గిల్ కెరీర్‌లో కీలక మలుపు కావచ్చు. ఈ నిర్ణయం భారత క్రికెట్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2026 అనంతరం అఫ్గానిస్థాన్‌తో భారత్ సిరీస్ ఆడనుంది. ఆపై ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ జరగనుంది.