Reading Time: < 1 minute
Samantha Marriage Raj Nidimoru Ugadi Video Maa Inti Bangaram Release Date

సమంత ప్రస్తుతానికి కొత్త మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసుకున్న ఆమె, ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాని స్వయంగా సమంత తన సొంత ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ మీద నిర్మిస్తోంది. అయితే, ఈ సినిమా మే 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా సుమ, సమంత, నందినీ రెడ్డి కలిసి ‘ఉగాది పచ్చడి చేయడం ఎలా’ అనే ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో సమంత తాను ఉగాది పచ్చడి చేసినట్లు తన భర్తకు వీడియో కాల్ చేసింది.

Also Read:Dhurandhar2 : గుడ్ న్యూస్.. ‘ధురంధర్ 2’ డబ్బింగ్ & సెన్సార్ పూర్తి.. షోస్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే

అప్పుడు ఆమె ‘బాబు’ అంటూ రాజ్‌ను సంబోధించడం హాట్ టాపిక్ అయింది. అంతేకాక, ఈ క్రమంలోనే రాజ్.. సమంతను ‘అసలు మీకు పచ్చడి చేయడం రాదు కదా’ అని అనడం, దానికి ఆమె సిగ్గుపడటం కనిపిస్తోంది. ఈ సినిమాకి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సమంత వివాహం అధికారికం చేయకముందే ఈ ప్రాజెక్టు మొదలైంది, కానీ మధ్యలో వీరి వివాహం జరిగింది. దీంతో షూటింగ్‌కు కాస్త బ్రేకులు పడ్డాయి. ఎట్టకేలకు షూటింగ్ కొంచెం మాత్రమే పెండింగ్ ఉందని, దాన్ని పూర్తి చేసి మే 15వ తేదీన సినిమా రిలీజ్ చేస్తామని సమంత చెబుతోంది.