July 9, 2026

నల్గొండలో కారు బీభత్సం 

నల్గొండలో కారు బీభత్సం 
Reading Time: < 1 minute

నల్గొండలో కారు బీభత్సం 

Caption of Image.

నల్గొండ, వెలుగు: నల్గొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిమిటెడ్ షాపింగ్ మాల్ ఎదుట జాతీయ రహదారిపై అతి వేగంతో దూసుకొచ్చి,  ఒక బైక్​ను, రోడ్డుపై  పని చేస్తున్న సఫాయి   కార్మికురాలిని ఢీకొట్టింది.  స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.   పోలీసులు  వచ్చి గాయపడ్డవారిని నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

బైక్​ పై ఉన్న  యువకుడి తలకు తీవ్ర గాయమై,  పరిస్థితి విషమంగా ఉండటంతో ఐకాన్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు.  మున్సిపల్ కార్మికురాలి రెండు కాళ్లు విరిగినట్టు సమాచారం. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.  కేసు నమోదు చేసుకున్న టూ టౌన్ పోలీసులు కారు డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.